గడప గడపనా నాయకులకు బ్రహ్మరథం పడుతున్న ప్రజలు
సాక్షి నెట్‌వర్క్: రాష్ట్రప్రభుత్వం చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం అన్ని జిల్లాల్లోనూ విజయవంతంగా కొనసాగుతోంది. కార్యక్రమంలో భాగంగా ఆదివారం వైఎస్సార్‌సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు గ్రామగ్రామానికి వెళ్లి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు.
తమ గ్రామానికి వచ్చిన నాయకులను ప్రజలు సాదరంగా ఆహ్వానిస్తూ తమ సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తున్న ప్రభుత్వానికి తామంతా అండగా నిలుస్తామని చెప్పారు. ప్రజలు తమ దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను నాయకులు అధికారులతో చెప్పి అక్కడికక్కడే పరిష్కరించారు.