యజ్ఞంలా ‘గడప గడపకు మన ప్రభుత్వం’

23 Aug, 2022 09:02 IST|Sakshi

నెల్లూరు(సెంట్రల్‌): జిల్లాలో గడప గడపకు మన ప్రభుత్వం యజ్ఞంలా జరుగుతోంది. మా అందరి సంక్షేమం కోసం పరితపిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి లబ్ధిదారులు ధన్యవాదాలు చెబుతున్నారు. పథకాలతో తమ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతోందని అనేకమంది ప్రజాప్రతినిధుల ఎదుట సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. సోమవారం పలువురు ఎమ్మెల్యేలు గ్రామాల్లో పర్యటించిలబ్ధిదారులతో మాట్లాడారు. సమస్యలు తెలుసుకున్నారు.

∙కందుకూరు నియోజకవర్గం లింగసముద్రం మండలంలోని తిమ్మారెడ్డిపాళెం గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌రెడ్డి నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను రాజకీయ పారీ్టలు, కులమతాలకు అతీతంగా అర్హతే ప్రామాణికంగా ప్రతి కుటుంబానికి అందిస్తున్నామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నారు. అందుకే ప్రజల్లోకి ధైర్యంగా వెళ్తున్నామని చెప్పారు.

∙నెల్లూరు రూరల్‌ పరిధిలోని 31వ డివిజన్‌ పరిధిలో చవటమిట్ట గిరిజన కాలనీ, నిర్మల లేఅవుట్‌ ప్రాంతాల్లో రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి పర్యటించారు. ఆయన మాట్లాడుతూ అర్హతే ప్రామాణికంగా, రాజకీయాలకు తావు లేకుండా సంక్షేమ పథకాలను సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  ప్రజలకు అందిస్తున్నారని చెప్పారు. రూరల్‌ నియోజకవర్గాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు.

∙కావలి నియోజకవర్గం బోగోలు మండలంలోని అల్లిమడుగు పంచాయతీ కడనూతలలో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే ప్రతి కుటుంబంతో మమేకమై పథకాల ద్వారా జరిగిన లబ్ధిని వివరించారు. గ్రామంలోని సమస్యలు తెలుసుకున్నారు. ఇప్పటి వరకు ఈ కార్యక్రమం ద్వారా రామిరెడ్డి పదివేల ఇళ్లను సందర్శించారు. ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్‌ మన్నెమాల సుకుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని ఎంపీపీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీ సభ్యులు, సర్పంచ్‌లు, స్థానిక సంస్థల ప్రతినిధులు కడనూతల చేరుకుని ఎమ్మెల్యేని ఘనంగా సత్కరించారు. 

మరిన్ని వార్తలు