జగన్‌ బొమ్మ చూపించు నాయనా.. బామ్మ ఆప్యాయత

2 Jul, 2022 09:36 IST|Sakshi
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఫొటోను బామ్మకు చూపిస్తున్న పోలాకి జెడ్పీటీసీ ధర్మాన కృష్ణచైతన్య

శ్రీకాకుళం : పోలాకి మండలం ప్రియాగ్రహారంలో జెడ్పీటీసీ ధర్మాన కృష్ణచైతన్యకు శుక్రవారం ఓ హృద్యమైన అనుభవం ఎదురైంది. పార్టీ నేతలతో కలిసి ఇంటింటికీ వెళ్తూ కోరాడ అమ్మాయమ్మ(84) ఇంటికి వెళ్లారు. బామ్మా నీకు పింఛన్‌ వస్తుందా.. అని అడిగితే.. ‘ఆ వస్తుంది గానీ నాకు జగన్‌ బొమ్మ చూపించు నాయనా..!’ అని ఆప్యాయంగా అడి గింది ఆ బామ్మ. దీంతో కృష్ణచైతన్య సీఎం చిత్రాన్ని బామ్మకు చూపించగా ఆమె మురిసిపోయారు. వేలిముద్ర పడకపోయినా సచివాలయం నుంచి ఒక వ్యక్తి వచ్చి పింఛను ఇస్తున్నారని ఆమె చెప్పి దీవించారు.  

మరిన్ని వార్తలు