రాష్ట్రంలో 87శాతం కుటుంబాలకు పథకాలు చేరాయి: సీఎం జగన్‌

8 Jun, 2022 19:45 IST|Sakshi

గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై తాడేపల్లిలో వర్క్‌షాప్‌

తాడేపల్లి: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో చేపడుతున్న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో వర్క్‌షాప్‌ నిర్వహించారు. మంత్రులు, రీజనల్ కో ఆర్డినేటర్స్, ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులు వర్క్‌షాప్‌కు హాజరయ్యారు.

ఈ సందర్భంగా వర్క్‌షాపును ప్రారంభిస్తూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏమన్నారంటే..

గడపగడపకూ అనేది నిరంతరాయంగా జరిగే కార్యక్రమం
దాదాపు 8 నెలలపాటు ఈకార్యక్రమం జరుగుతుది
ఒక్కో సచివాలయానికి రెండు రోజులపాటు కేటాయింపు
నెలలో 20 రోజులచొప్పున 10 సచివాలయాల్లో గడపగడపకూ కార్యక్రమం


గడపగడపకూ కార్యక్రమాన్ని ఏరకంగా చేశాం? ఎలా చేస్తున్నాం? ఇంకా ఎలా మెరుగుపరుచుకోవాలి? ఎలా సమర్థత పెంచుకోవాలి? అన్నదాన్నికూడా మనం నిరంతరంగా చర్చించుకోవాలి. అందుకోసం నెలకోసారి వర్క్‌షాపు నిర్వహిస్తాం
ఆ నెలరోజుల్లో చేపట్టిన గడపగడపకూ కార్యక్రమం, ఈ కార్యక్రమం ద్వారా మనకు వచ్చిన ఫీడ్‌ బ్యాక్‌పై ఈ వర్క్‌షాపులో చర్చిస్తాం
ఇంకా మెరుగ్గా, సమర్థవంతంగా కార్యక్రమాన్ని ఎలా నిర్వహించాలన్నదానిపై ఈ వర్క్‌షాపుల్లో దృష్టిసారిస్తాం
ప్రజాప్రతినిధుల నుంచి ఈ వర్క్‌షాపుల్లో సూచనలు, సలహాలు కూడా నిరంతరంగా తీసుకుంటాం, వాటిపై చర్చిస్తాం. దీనివల్ల మన ప్రయాణం మరింత మెరుగ్గా సాగుతుంది


గడపగడపకూ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులకు ప్రజలనుంచి వచ్చిన విజ్ఞాపనలు, ఆ విజ్ఞాపనల పరిష్కారం కూడా అత్యంత ముఖ్యమైనది
ఈ ప్రక్రియ సజావుగా, సమర్థవంతంగా సాగడంపైన కూడా దృష్టిపెడుతున్నాం
గత ఎన్నికల్లో 151 సీట్లు వచ్చాయి. వచ్చే ఎన్నికల్లో 175కి 175 సాధించాలి. 
ఇది మన లక్ష్యం, ఇది కష్టం కాదు. ఎందుకంటే.. ప్రతి ఇంటికీ మీరు వెళ్తున్నారు, ప్రతి ఇంటికీ జరిగిన మేలును వివరిస్తున్నారు
ఏయే పథకాలు ఆ కుటుంబానికి అందాయో చెప్తున్నారు. ప్రతి అక్క చెల్లి పేరుమీద లేఖ కూడా ఇస్తున్నారు
మనకు ఓటు వేయని వ్యక్తికి కూడా కులం చూడకుండా, మతం చూడకుండా, రాజకీయాలు చూడకుండా, పార్టీలు చూడకుండా పారదర్శకంగా మేలు చేశాం
ప్రతి ఇంటికీ మేలు జరిగినప్పుడు.. ప్రజా ప్రతినిధులుగా మనకు ఏంకావాలి


చరిత్రలో మనం ఒక ముద్ర వేశాం
సంతృప్తిస్థాయిలో మంచి చేశామని చెప్పుకోగలుగుతున్నాం. కాలర్‌ ఎగరేసుకుని తిరగగలుగుతున్నాం
ఇక మనం చేయాల్సిందల్లా.. ప్రజల మద్దతును మనం తీసుకోవడమే
ఎవరైనా అనుకున్నామా? కుప్పంలో మున్సిపాల్టీ గెలుస్తామని?
ఎంపీటీసీలు, జడ్పీటీసీలు క్లీన్‌ స్వీప్‌ చేస్తామని? ఎందుకు జరిగింది?
అలాగే 175కి 175 సాధించగలుగుతాం. ఇది జరగాలి అంటే.. మనం కష్టపడాలి


రాష్ట్రంలోని 87శాతం కుటుంబాలకు పథకాలు చేరాయి
ప్రతి సచివాలయంలోనూ కచ్చితంగా 2 రోజులు గడపగడపకూ నిర్వహించాలి
ప్రతి సచివాలయంలోనూ పొద్దుట నుంచి సాయంత్రం 6–7వరకూ గడపగడకూ నిర్వహించాలి
ప్రతి నెలలో 10 సచివాలయాలు నిర్వహించేలా ప్రణాళిక వేసుకోవాలి
ప్రతి నెలలో 20 రోజులు గడపగడపకూ నిర్వహించాలి. కార్యక్రమాన్ని నాణ్యతతో చేయడం అన్నది చాలా ముఖ్యం' అని సీఎం జగన్‌ అన్నారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

చదవండి: (World Brain Tumor Day: మెదడులో కల్లోలం.. లక్ష మందిలో ఏడుగురికి)

మరిన్ని వార్తలు