పేద విద్యార్థిని నీట్‌లో సీటు

30 Nov, 2020 12:12 IST|Sakshi

సాక్షి, కూనవరం: పేదింటి విద్యార్థిని గడ్డం ప్రేమలత సీట్‌లో సీటు సాధించింది. కూనవరం గ్రామానికి చెందిన ప్రేమలత తల్లిదండ్రులు చిరువ్యాపారులు. తండ్రి చెప్పుల దుకాణం నడుపుతూ, తల్లి తోపుడు బండిపై ప్లాస్టిక్‌ వస్తువులు అమ్ముతూ జీవిస్తున్నారు. తల్లిదండ్రులు పెద్దగా చదువు కోనప్పటికీ తమ పిల్లలను చదివించాలన్న దృఢ సంకల్పంతో చాలీచాలని సంపాదనతోనే ఇద్దరు పిల్లలను మాంటిస్సోరీ కాన్వెంట్‌లో 6వ తరగతి వరకూ చదివించారు.

అనంతరం ప్రేమలత 7, 8 తరగతులు కోతులగుట్ట ఏపీఆర్‌ గురుకుల పాఠశాలలో చదివింది. జవహర్‌ నవోదయ ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఎటపాకలో తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం వరకూ చదివింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో నిర్వహించిన ఆలిండియా స్థాయి జేఈఈ (జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌) మెయిన్స్‌లో మంచి ర్యాంక్‌ సాధించి, త్రిపుర రాష్ట్రం అగర్తలలో నిట్‌లో (ఎన్‌ఐటీ) సీటు సాధించింది. సివిల్స్‌ సాధించడమే తన లక్ష్యమని ప్రేమలత తెలిపింది.

మరిన్ని వార్తలు