‘ప్రతి క్షణం ఆయన ప్రజల కోసమే ఆలోచిస్తున్నారు’

12 Aug, 2020 12:09 IST|Sakshi

సాక్షి, వైఎస్సార్‌ కడప : కరోనా వైరస్‌ మహమ్మారితో ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌ రెడ్డి అన్నారు. దగ్గు, జలుబు, జ్వరం ఏ విధంగా వస్తుందో అలాగే కరోనా కూడా తొందరగానే నయమవుతుందని ఆయన పేర్కొన్నారు. రాయచోటి పట్టణం శివారులో 300 పడకల కోవిడ్ కేర్ సెంటర్‌ను బుధవారం చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌ రెడ్డి, ఎమ్మెల్సీ జకీయా ఖానంలు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రతి ఒక్క పనిని క్షేత్ర స్థాయి నుంచి ఆలోచిస్తారన్నారు. అందులో భాగంగానే కోవిడ్ కేర్‌ సెంటర్‌లలో ఆహరం కూడా మెనూ ప్రకారం అందిస్తున్నారని అన్నారు. (రమేశ్‌ ఆస్పత్రి ఘటనపై ఎందుకు మాట్లాడవు బాబూ?)

రాష్ట్రంలోని 30 వేలకు పైగా వైద్యుల పోస్టులను భర్తీ చేస్తున్న ఘనత సీఎం వైఎస్‌ జగన్‌దేనని ప్రశంసించారు. 13 మెడికల్‌ కళాశాలలను వైఎస్‌ జగన్‌ త్వరలో ప్రారంభించబోతున్నాడని తెలిపారు. ప్రతి మనిషికి మనోధైర్యం కల్పించేందుకు ముఖ్యమంత్రి ప్రతి క్షణం ఆలోచన చేస్తున్నారని పేర్కొన్నారు. కరోనా ప్రతి ఒక్కరికి వచ్చే అవకాశం ఉందని అయితే ప్రభుత్వ సూచనలు, సలహాలు పాటిస్తూ ఉంటే తగ్గిపోతుంనన్నారు. వైరస్‌ పట్ల అనవసర భయాందోళనలు పెట్టుకోవద్దని, జాగ్రత్తలు వహిస్తూ, రోగనిరోధక శక్తి పెంచుకోంటే చాలని సూచించారు. (‘ఈ-రక్షాబంధన్‌’కు విశేష స్పందన)

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా