ప్రాజెక్టు వివరాలు పంపితే సహకారం అందిస్తాం

3 Oct, 2020 13:20 IST|Sakshi

సాక్షి, తిరుమల: తిరుమలలోని శ్రీవారిని  కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షేకావత్‌ శనివారం దర్శించుకున్నారు. అనంతరం ఆయన పాపవినాశనం డ్యామ్‌ని రాష్ట్ర మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌తో కలిసి  పరిశీలించారు. ఈ క్రమంలో‌ కేంద్రమంత్రి మీడియాతో మాట్లాడుతూ.. శ్రీవారి దర్శనార్థం ప్రతి నిత్యం లక్షమంది భక్తులు తరలివస్తారని తెలిపారు. తిరుమలలో శాశ్వత ప్రాతిపదికన త్రాగునీటి సమస్యని పరిష్కరించేందుకు కళ్యాణి డ్యామ్‌ నుంచి నీటి తరలింపు ప్రకియ ప్రారంభించాలని టీటీడీ భావిస్తోందని పేర్కొన్నారు. రాష్ర్ట ప్రభుత్వం నుంచి ప్రాజెక్టు వివరాలు పంపితే కేంద్రం నుంచి సహకారం అందించే ప్రయత్నం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. దేశవ్యాప్తంగా ప్రతి ఇంటికి త్రాగునీటిని అందించే ప్రాజెక్టు కింద నిధులు కేటాయించేందుకు సహకారం అందిస్తామని తెలిపారు. చదవండి: (శిల్పారామాలకు పరిపాలనా అనుమతులు జారీ)

ఈ సందర్భంగా మంత్రి అనిల్కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. తిరుమలలో శాశ్వత ప్రాతిపాదికన త్రాగునీటి సమస్యని పరిష్కరించేందుకు రాష్ర్ట ప్రభుత్వం టీటీడీ సంయుక్తంగా బాలాజీ రిజర్వాయర్ నిర్మాణం చేపడుతోందని తెలిపారు. టీటీడీ వాటాకు సంబంధించి రాష్ర్ట ప్రభుత్వం నుంచి నివేదిక పంపితే కేంద్రం సహకారం అందిస్తామని పేర్కోందని చెప్పారు. అదే విధంగా బీజేపీ అధికారిక ప్రతినిధి భానుప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ.. తిరుమలలో త్రాగునీటి సమస్యని శాశ్వత పరిష్కారం అందించేందుకు కేంద్రం సహకరించాలని మంత్రి దృష్టికి తీసుకువెళ్లామని తెలిపారు. రాష్ట్రం నుంచి నివేదిక అందితే పరిశీలిస్తామని మంత్రి షేకావత్ హామి ఇచ్చారని చెప్పారు.

>
మరిన్ని వార్తలు