Gandhi Jayanti 2023: గాంధీ కలలు కన్న గ్రామస్వరాజ్యాన్ని నిజం చేశాం: సీఎం జగన్‌

2 Oct, 2023 09:04 IST|Sakshi

సాక్షి, గుంటూరు: జాతిపిత మహాత్మాగాంధీ 154వ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి నివాళులు అర్పించారు.ఈ  సందర్భంగా ఎక్స్‌ అకౌంట్‌లో ఆయన నివాళి సందేశం ఉంచారు. 

‘‘మహాత్మా గాంధీ గారి మాటలు ఆదర్శంగా... రాష్ట్ర ప్రజలందరి సంక్షేమమే లక్ష్యంగా పాలన చేస్తున్నాం. గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా గాంధీ గారు కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని నిజం చేశాం.మునుముందు కూడా ఆయన చూపిన మార్గంలోనే నడుస్తాం. నేడు మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా నివాళులు’’ అని పేర్కొన్నారాయన. 

మరిన్ని వార్తలు