కోటీ 65 లక్షల కరెన్సీ నోట్లతో గణనాథుడి అలంకరణ

3 Sep, 2022 17:43 IST|Sakshi

గుంటూరులోని ఆర్‌.అగ్రహారం శ్రీ కన్యకాపరమేశ్వరి దేవస్థానంలో శ్రీ దశావతార గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం గణనాథుడిని కోటీ అరవై ఐదు లక్షల రూపాయల కరెన్సీ నోట్లతో అలంకరించారు. శ్రీలక్ష్మీగణపతికి భక్తులు పూజలు నిర్వహించారు. 


గుంటూరులోని 21వ డివిజన్‌ కార్పొరేటర్‌ కె.గురవయ్య ఆధ్వర్యంలో కేవీపీ కాలనీ 1/10వ లైనులో 16వ వినాయక చవితి మహోత్సవాల్లో భాగంగా గణనాథుడిని రూ. 44,44,444 విలువైన కరెన్సీ నోట్లతో సుందరంగా అలకరించారు.               
– నెహ్రూనగర్‌(గుంటూరు ఈస్ట్‌) 


రూ.కోటిన్నర కరెన్సీతో విఘ్నేశ్వరుడికి అభిషేకం

ఖిలా వరంగల్‌: కోటిన్నర రూపాయలతో విఘ్నేశ్వరుడికి శుక్రవారం రాత్రి అభిషేకం నిర్వహించారు వరంగల్‌ శివనగర్‌లోని వాసవి కాలనీవాసులు. 108 మంది ఇచ్చిన 1,43,11,116 రూపాయల్లో కొన్నింటిని దండలు చేసి మారేడు చెట్టుకు ఉయ్యాల ఊగుతున్న విఘ్నేశ్వరునికి అలంకరించారు. మిగిలిన నోట్ల కట్టలను గణేషుడి ముందుంచి లక్ష్మీపూజ నిర్వహించారు.  (క్లిక్‌: 27 నుంచి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు)

మరిన్ని వార్తలు