కనుల పండువగా గంగమ్మ జాతర

18 May, 2022 05:19 IST|Sakshi
భక్తులతో పోటెత్తిన శ్రీతాతయ్యగుంట చిన్న గంగమ్మ ఆలయం, గంగమ్మ తల్లి మూల విరాట్‌

తిరుపతి తుడా: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుని చెల్లెలుగా భాసిల్లుతున్న తిరుపతి గ్రామదేవత గంగమ్మ ఉత్సవాలు కనుల పండువగా ముగిశాయి. గత నెల 10వ తేదీ మంగళవారం అర్ధరాత్రి చాటింపుతో ప్రారంభమైన గంగమ్మజాతర మంగళవారంతో ముగిసింది. బుధవారం తెల్లవారుజామున అమ్మవారి విశ్వరూప చెంప తొలగింపుతో జాతర పరిసమాప్తమవుతుంది.

తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి పర్యవేక్షణలో తొలిసారిగా భారీ ఏర్పాట్లతో దగ్గరుండి జాతరను నిర్వహించారు. కరోనా మహమ్మారి కారణంగా గత రెండేళ్లు జాతరను ఏకాంతంగా నిర్వహించారు. కరోనా తర్వాత 900 ఏళ్లనాటి చరిత్రను చాటిచెప్పేలా తిరుపతి శ్రీతాతయ్యగుంట చిన్న గంగమ్మ జాతర ఉత్సవాలను నిర్వహించారు. మంగళవారం లక్ష మందికి పైగా భక్తులు పొంగళ్లు పెట్టి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు.

జాతర రోజున ప్రతి ఏటా వరుణుడు కరుణించడం పరిపాటి. గత సంప్రదాయాలతో పాటు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి తొలిసారి అమ్మవారికి తన ఇంటి నుంచి సారె తీసుకురావడంతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, కోఆప్షన్‌ సభ్యుల చేత ఊరేగింపుగా అమ్మవారికి సారెను సమర్పించారు. జాతర రోజున మునుపెన్నడూ లేని విధంగా లక్షమందికి పైగా భక్తులకు మటన్‌ బిరియానీని పంచిపెట్టారు. 

మరిన్ని వార్తలు