గంజి ప్రసాద్ హత్య కేసులో కీలక పరిణామం: పోలీసులు అదుపులో బజారయ్య

1 May, 2022 19:01 IST|Sakshi

సాక్షి, ఏలూరు:  జిల్లాలో జరిగిన గంజి నాగప్రసాద్‌ హత్య కేసులో ప్రధాన నిందితుడైన బజారయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ ఆధారంగా కేసరపల్లి టోల్‌గేట్‌ వద్ద బజారయ్య ఉన్నట్లు పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు ఆయనను కోర్టులో హాజరుపరచనున్నారు. ​​హత్య కేసుకు సంబంధించి 10 మంది నిందితులపై 120బి, 302 ఐపీసీ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే పోలీసులు ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

ఇదిలా ఉంటే, గంజి నాగప్రసాద్‌కు, గ్రామానికి చెందిన ఎంపీటీసీ సభ్యుడు బిరుదుగడ్డ బజారియ్యకు పాతకక్షలు ఉన్నాయి. వీరు పార్టీలో రెండు వర్గాలుగా ఉంటున్నారు. ఇటీవల బజారియ్య వర్గంలోని మండవల్లి సురేష్‌కు చెందిన మిఠాయి బండిపై కొందరు దాడిచేశారు. ఇది గంజి ప్రసాదే చేయించాడని సురేష్, అతని స్నేహితులు ఉండ్రాజవరపు మోహన్, శానం హేమంత్, మరికొందరు భావించారు. ప్రతి విషయంలోనూ తమకు అడ్డుపడుతున్న నాగప్రసాద్‌ను ఎలాగైనా అడ్డుతొలగించుకోవాలని సురేష్, మోహన్, హేమంత్‌ నిర్ణయించుకున్నారు.

చదవండి👉 గంజి ప్రసాద్‌ కుటుంబ సభ్యులను పరామర్శించిన హోంమంత్రి

ఈ నేపథ్యంలో.. శనివారం ఉ.7.30కు నాగప్రసాద్‌ పాల కోసం తన ఇంటి నుంచి వెళ్తున్నాడు. ఈ విషయాన్ని జి.నాగరాజు అనే వ్యక్తి నిందితులకు సమాచారం అందించాడు. దీంతో సురేష్, మోహన్, హేమంత్‌లు బైక్‌పై నాగప్రసాద్‌కు ఎదురెళ్లి, పాఠశాల వద్ద అతడి వాహనాన్ని ఆపారు. అనంతరం ముగ్గురూ ఒక్కసారిగా నాగప్రసాద్‌పై కత్తులతో దాడిచేశారు. ముందుగా అతడి చేతిని నరికేశారు. ఆ తరువాత మెడపై, కాలిపై నరికారు. అతడు చనిపోయినట్లు నిర్ధారించుకున్నాక వారు ద్వారకా తిరుమల పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయారు.

చదవండి👉  వైఎస్సార్‌సీపీ నేత దారుణ హత్య

మరిన్ని వార్తలు