రెండు వేల ఎకరాలలో మూడు కాన్సెప్ట్‌ సిటీలు

2 Apr, 2021 14:20 IST|Sakshi

ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి

సాక్షి, విజయవాడ: ఐటీ పరిశ్రమ విస్తరణ కోసమే  సీఎక్స్‌ఓ సదస్సు నిర్వహిస్తున్నామని ఐటీ శాఖ మంత్రి గౌతమ్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచనలతో ఐటీ రంగాన్ని ముందుకు తీసుకెళ్తామన్నారు. పాదయాత్రలో సీఎం జగన్ ప్రజల సమస్యలు తెలుసుకున్నారని.. అందుకే నాణ్యమైన విద్య, వైద్యం అందించేలా సంస్కరణలు తెచ్చారన్నారు.

విద్యారంగంలో విద్యాకానుక పథకం సహా అనేక పథకాలు తెచ్చారని.. ప్రతి పౌరుడికి నాణ్యమైన విద్య,వైద్యం కోసం పథకాలు అమలు చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. వ్యవసాయ అభివృద్ధి, నాణ్యమైన మానవ వనరుల తయారీకి కృషి చేస్తున్నామన్నారు. కోవిడ్ వల్ల తీవ్ర ఇబ్బందులు వచ్చాయని.. అలాంటి సమయంలో ఎంఎస్‌ఎంఈ పరిశ్రమలను ఏపీ ప్రభుత్వం ఆదుకుందన్నారు. జగనన్న తోడుతో చిన్న వ్యాపారులకు ఉపాధి అవకాశాల కల్పనకు సహకరించామని మంత్రి గౌతమ్‌రెడ్డి తెలిపారు.

ప్రతి పథకాన్నినేరుగా లబ్ధిదారులకు ప్రభుత్వం అందిస్తోందన్నారు. ప్రభుత్వ నిర్వహణలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నామని, ఐటీ మౌలిక వసతులు కల్పించడంపై దృష్టి పెట్టామని పేర్కొన్నారు. రెండు వేల ఎకరాలలో 3 కాన్సెప్ట్‌ సిటీలను నిర్మించ బోతున్నామని వెల్లడించారు. ఫైబర్ నెట్ ద్వారా ప్రతి గ్రామానికి 2024 నాటికి ఇంటర్నెట్‌ అందిస్తామన్నారు. ప్రతి గ్రామంలో డిజిటల్ లైబ్రరీ, డిజిటల్ బ్రాడ్ బ్యాండ్ ఏర్పాటు చేస్తామని మంత్రి గౌతమ్‌రెడ్డి వెల్లడించారు.
చదవండి:
పాలకులం కాదు.. మనం సేవకులం: సీఎం జగన్‌‌
జగనన్నను కలిశాకే.. ఈ కాళ్లకు చెప్పులు

మరిన్ని వార్తలు