రైతులకు రూ.700 కోట్లు జమ

27 May, 2022 05:40 IST|Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా 5,000కు పైగా ఆర్బీకేల ద్వారా రబీ ధాన్యం కొనుగోళ్లు చేపట్టినట్లు పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ గిరిజా శంకర్‌ గురువారం తెలిపారు. ఈ సీజన్‌లో 37 లక్షల టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం కాగా ఇప్పటివరకు 1,35,640 మంది రైతుల నుంచి 17.20 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ధాన్యం విక్రయించి 21 రోజులు దాటిన రైతులందరికీ కలిపి మొత్తంగా రూ.700 కోట్లు జమ చేసినట్లు వివరించారు. 

మరిన్ని వార్తలు