తండ్రి మందలింపు.. బాలిక ఆత్మహత్య 

26 Nov, 2021 07:23 IST|Sakshi

గుత్తి: తండ్రి మందలించడంతో మనస్తాపం చెందిన ఓ బాలిక ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. గుత్తిలోని జెడ్‌.వీరారెడ్డి కాలనీకి చెందిన సుబ్బయ్యకు భార్య, ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. ఇటీవల సుబ్బయ్య రెండో కుమార్తె ఈరమ్మ (13) ఎవరికీ తెలియకుండా ఇంటిలోని దేవుడి హుండీలో ఉన్న డబ్బు తీసుకుంది. ఈ విషయం తెలుసుకున్న తండ్రి ఆమెను మందలించాడు. దీంతో మనస్తాపం చెందిన ఆమె గురువారం ఇంటిలో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న సీఐ శ్యామరావు అక్కడకు చేరుకుని పరిశీలించి, కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.   

మరిన్ని వార్తలు