ప్రాణాలతో బయటపడిన బాలిక.. 

11 Sep, 2020 08:27 IST|Sakshi
మౌనికతో ఆమెను కాపాడిన యువకులు, పోలీసులు  

కలువాయి (నెల్లూరు జిల్లా): తెలుగుగంగ కాలువలో 8 కి.మీ కొట్టుకుపోయిన బాలిక ప్రాణాలతో బయటపడింది. ఈ ఘటన శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కలువాయి సమీపంలో గురువారం జరిగింది. కలువాయి గిరిజన కాలనీలో తన అవ్వతాతలతో కలిసి ఉంటున్న కంభంపాటి మౌనిక (9) గురువారం కాలనీకి సమీపంలోని తెలుగుగంగ కాలువ వద్దకు తన సోదరితో వెళ్లింది. అక్కడ ఆడుకుంటూ ఉండగా కాలువలో జారి పడింది. కాలువకు 11 వేల క్యూసెక్కులు నీటిని వదలడంతో నీటి ఉధృతికి కొట్టుకుపోసాగింది. ఆమె సోదరి ఇంటికి వెళ్లి జరిగిన విషయాన్ని చెప్పింది. కుటుంబీకులు వచ్చి గాలించినా మౌనిక ఆచూకీ లభించలేదు. (చదవండి: అరచేతిలో పోలీస్‌ స్టేషన్‌!)

సమాచారం అందుకున్న కలువాయి ఎస్‌ఐ ఎం.ఆంజనేయులు తన సిబ్బందితో కలిసి కాలువ వెంబడి గాలించారు. బాలిక 8 కిలోమీటర్లు కొట్టుకుపోయి బాలాజీరావుపేట గ్రామ సమీపంలో కాలువపై వెళ్తున్న కత్తి కృష్ణయ్య అనే వ్యక్తిని చూసి కాపాడాలని కేకలు వేసింది. కృష్ణయ్య గ్రామస్తులకు, పోలీసులకు సమాచారమిచ్చాడు. పోలీసులు అక్కడికి చేరుకునే సరికి గ్రామస్తులు తాళ్లు తీసుకుని వచ్చారు. కొండపోగు ప్రసాద్, మరికొందరు యువకులు, పోలీసులు తాళ్లువేసి మౌనికను లాగి ఒడ్డుకు చేర్చారు. (చదవండి: నటి శ్రావణి ఆత్మహత్య కేసు: గంటకో మలుపు

మరిన్ని వార్తలు