వ్యాక్సిన్‌ కొనుగోలుకు మళ్లీ గ్లోబల్‌ టెండర్‌

6 Jun, 2021 06:05 IST|Sakshi

10న ప్రీబిడ్‌ సమావేశం.. 21న టెండర్లు  

సాక్షి, అమరావతి: వ్యాక్సిన్‌ కొనుగోలు కోసం రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ గ్లోబల్‌ టెండర్‌కు వెళ్లింది. రాష్ట్ర మౌలిక వైద్య సదుపాయాల అభివృద్ధి సంస్థ(ఏపీఎంఎస్‌ఐడీసీ) శనివారం కొత్తగా టెండర్లు పిలిచింది. ఈ నెల 10వ తేదీన ప్రీబిడ్‌ మీటింగ్‌ నిర్వహించనుండగా, జూన్‌ 21న టెండర్లు ఓపెన్‌ చేస్తారు. గతంలో నిర్వహించిన టెండర్లలో మూడు కంపెనీలు ప్రీబిడ్‌ మీటింగ్‌ రాగా, ఫైనల్‌ టెండరుకు ఒక్క కంపెనీ కూడా ఆసక్తి కనబరచకపోవడం తెలిసిందే.

ఇప్పటికే పలు రాష్ట్రాలు వ్యాక్సిన్‌ కోసం గ్లోబల్‌ టెండర్లకు వెళ్లినా ఏ రాష్ట్రంలో ఒక్క కంపెనీ కూడా సరఫరా చేస్తామని ముందుకు రాలేదు. కాగా, ఒక్కసారి ఆన్‌లైన్‌ టెండర్‌ పూర్తయ్యాక గడువు పొడిగించడానికి కుదరదు. కొత్త టెండర్‌కు వెళ్లాల్సిందే. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం తిరిగి గ్లోబల్‌ టెండర్‌ను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేశారు. 

మరిన్ని వార్తలు