పంది పిల్లకు పాలిచ్చిన మేక

21 Sep, 2022 09:37 IST|Sakshi

ద్వారకాతిరుమల:  వరాహం పిల్లకు పాలిచ్చి ఓ మేక దాని ఆకలిని తీర్చింది. ద్వారకాతిరుమల చినవెంకన్న శేషాచల కొండపైన పవర్‌స్టేషన్‌ ప్రాంతంలో మంగళవారం ఈ దృశ్యం కనిపించింది. దొరసానిపాడుకు చెందిన ఒక  కాపరి తన మేకలను కొండపైన మేపుతోంది. అందులో ఓ మేక చుట్టూ కొద్ది రోజులుగా వరాహం పిల్ల తిరుగుతోంది. ఆకలిగా ఉందో ఏమో.. ఆ వరాహం పిల్ల మేక పాలను తాగింది. మేక సైతం కదలకుండా వరాహం పిల్లకు పాలివ్వడాన్ని చూసిన వారంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు