శాంతించిన గోదావరి

22 Jul, 2022 03:51 IST|Sakshi
నరసాపురం వశిష్ట గోదావరి వలంధర్‌ రేవు ప్రాంతంలో నీటిమట్టం క్రమేపీ తగ్గుతున్న దృశ్యం

ధవళేశ్వరం బ్యారేజ్‌లోకి 13.46 లక్షల క్యూసెక్కుల ప్రవాహం

గోదావరి డెల్టాకు 7,700 క్యూసెక్కులు విడుదల

మిగతా 13.39 లక్షల క్యూసెక్కులు కడలిలోకి

ధవళేశ్వరం వద్ద కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక

భద్రాచలం వద్ద 46.3 అడగులకు చేరిన నీటి మట్టం

పోలవరం ప్రాజెక్టులోకి 11.37 లక్షల క్యూసెక్కుల ప్రవాహం

సాక్షి, అమరావతి/ధవళేశ్వరం/పోలవరం రూరల్‌: గోదావరి శాంతించింది. పరివాహక ప్రాంతంలో వర్షాలు తెరిపి ఇవ్వడం, ఉప నదుల్లో ప్రవాహం తగ్గుతుండటంతో గురువారం గోదావరిలో వరద మరింత తగ్గింది. ధవళేశ్వరం బ్యారేజ్‌లోకి గురువారం సాయంత్రం 6 గంటలకు 13,46,852 క్యూసెక్కులు వస్తుండటంతో నీటిమట్టం 14.20 అడుగులకు తగ్గింది. నీటిమట్టం 13.75 అడుగు లకంటే దిగువకు చేరుకునే వరకు బ్యారేజ్‌ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగనుంది. బ్యారేజ్‌ లోకి చేరుతున్న నీటిలో 7,700 క్యూసెక్కులను గోదావరి డెల్టాకు విడుదల చేస్తున్నారు. మిగులుగా ఉన్న 13,39,152 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు.

శుక్రవారం బ్యారేజ్‌లోకి వచ్చే వర ద మరింత తగ్గనుంది. వర్షాలు తెరిపి ఇవ్వడంతో ప్రాణహిత, ఇంద్రావతి, కడెంవాగు తదితర ఉప నదుల నుంచి గోదావరికి వచ్చే వరద తగ్గింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ ్డ(లక్ష్మీ) బ్యారేజ్‌లోకి వస్తున్న వరద 7,83,460 క్యూసెక్కులకు, తుపాకులగూడెం (సమ్మక్క) బ్యా రేజ్‌లోకి చేరుతున్న ప్రవాహం 8,92,340 క్యూసె క్కులకు తగ్గింది. దాంతో వాటి దిగువనున్న సీత మ్మసాగర్‌లోకి వస్తున్న వరద 10,67,705 క్యూసె క్కులకు తగ్గింది.

గురువారం సాయంత్రం 6 గంట లకు భద్రాచలం వద్ద వరద నీటి మట్టం 46.30 అడుగులకు తగ్గింది. దాంతో రెండో ప్రమాద హెచ్చరికను అధికారులు ఉపసంహరించారు. పోలవరం వద్దకు గురువారం 6 గంటలకు 11,37,103 క్యూసెక్కులు చేరుతోంది. స్పిల్‌ వే వద్ద నీటిమట్టం 33.47 మీటర్లకు చేరింది. స్పిల్‌ వేకు దిగువన నీటిమట్టం 25.15 మీటర్లు ఉంది. 

మరిన్ని వార్తలు