రేడియల్‌ గేట్ల ద్వారా గోదావరి జలాలు

26 Jun, 2021 05:04 IST|Sakshi
పోలవరం రేడియల్‌ గేట్ల ద్వారా స్పిల్‌ చానల్‌లోకి చేరుతున్న గోదావరి జలాలు 

పోలవరం రూరల్‌: పోలవరం ప్రాజెక్ట్‌ రేడియల్‌ గేట్ల ద్వారా గోదావరి జలాలు తొలిసారిగా దిగువకు చేరుతున్నాయి. స్పిల్‌వే క్లస్టర్‌ ఎత్తు 25.72 మీటర్లు కాగా.. నీటిమట్టం అంతకుమించి పెరగడంతో 10 రేడియల్‌ గేట్ల నుంచి నీరు దిగువకు ప్రవహిస్తోంది. ఈ ఏడాది ఎగువ కాఫర్‌ డ్యామ్‌ నిర్మాణం పనులు పూర్తిచేసి స్పిల్‌వే మీదుగా గోదావరి వరద నీటిని మళ్లించేందుకు శ్రీకారం చుట్టారు. దీంతో కాఫర్‌డ్యామ్‌ ఎగువ భాగాన నీటిమట్టం రోజు రోజుకు పెరుగుతోంది.

నదీ పరీవాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షం నీరు నదిలో కలుస్తుండటంతో స్పిల్‌వే క్లస్టర్‌ వద్ద నీటిమట్టం శుక్రవారం నాటికి 26.2 మీటర్ల ఎత్తుకు పెరిగింది. క్లస్టర్‌ లెవెల్‌ దాటడంతో రేడియల్‌ గేట్ల ద్వారా నీరు స్పిల్‌ చానల్‌లోకి చేరుతోంది. అక్కడి నుంచి పైలట్‌ చానల్‌ వద్ద మహానందీశ్వర స్వామి ఆలయం దిగువన గోదావరి సహజ ప్రవాహంలో కలుస్తోంది. 

మరిన్ని వార్తలు