ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్‌గా గౌతమ్‌రెడ్డి బాధ్యతలు

6 Feb, 2021 11:10 IST|Sakshi

టీడీపీ హయాంలో ఫైబర్‌గ్రిడ్‌లో రూ.వేల కోట్లు స్వాహా

గత ప్రభుత్వ అవినీతిని వెలికి తీస్తాం

ఏపీఎస్ఎఫ్ఎల్ ఛైర్మన్‌ గౌతమ్‌రెడ్డి

సాక్షి, విజయవాడ: ఏపీ స్టేట్‌ ఫైబర్‌నెట్‌ మిలిటెడ్‌ (ఏపీఎస్ఎఫ్ఎల్) చైర్మన్‌గా పి. గౌతమ్‌రెడ్డి శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచన విధానాలకు అనుగుణంగా పనిచేస్తానని తెలిపారు. ఫైబర్ గ్రిడ్ ద్వారా  ట్రిపుల్ ప్లే సర్వీసులు అందిస్తామని ఆయన వెల్లడించారు.ఈ సర్వీసులు తక్కువ ధరకే అందిస్తామని చెప్పారు. కేబుల్,ఇంటర్నెట్, టెలిఫోన్ సౌకర్యం కల్పిస్తామని పేర్కొన్నారు. (చదవండి: టీడీపీలో రచ్చకెక్కిన విభేదాలు..)

‘‘గ్రామ, మండలస్థాయిలో అండర్ గ్రౌండ్ కేబుల్ లైన్స్ వేస్తాం. ఫైబర్ గ్రిడ్‌లో 10లక్షల కనెక్షన్స్‌ ఉన్నాయి. త్వరలో కొత్త సెట్ టాప్‌బాక్స్‌లు తీసుకువస్తాం. రూ. 599లకే అన్ లిమిటెడ్ ప్లాన్‌తో నెట్ కేబుల్ ఇస్తాం. రూ.450లకే ఇంటర్‌నెట్‌ను అన్‌లిమిటెడ్‌తో ఇస్తాం. విద్యార్థుల లాప్‌ట్యాప్‌లకు ఫైబర్ గ్రిడ్ ద్వారా నెట్ ఇస్తాం. ఫైబర్‌గ్రిడ్‌లో రూ.వేల కోట్లు స్వాహా చేశారు. గత ప్రభుత్వం చేసిన అవినీతిని వెలికి తీస్తాం. సీబీఐ విచారణ కూడా చేస్తుంది.అవినీతికి పాల్పడిన ఒక్కరినీ కూడా వదలమని’’గౌతమ్‌రెడ్డి స్పష్టం చేశారు.(చదవండి: టీడీపీ కుటిల యత్నం!

మరిన్ని వార్తలు