4 సెక్షన్లుగా కలెక్టరేట్‌ పాలన

10 Apr, 2022 10:59 IST|Sakshi

ఏలూరు(మెట్రో): ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంలో, ప్రజల పనులు జరిగేలా ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంలో జిల్లా కలెక్టరేట్‌ కీలక పాత్ర పోషిస్తోంది. కలెక్టరేట్‌ అంటే కేవలం కలెక్టర్, జాయింట్‌ కలెక్టర్, డీఆర్వో మాత్రమే అనుకుంటారు. అయితే కలెక్టర్‌ కార్యాలయంలో ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్, జీ, హెచ్‌ అనే 8 సెక్షన్‌లు ఉంటాయి. ప్రజలకు ఏ అవసరం వచ్చినా, ఏ సమస్య పరిష్కరించాలన్నా ఈ సెక్షన్‌లు కీలక పాత్ర పోషిస్తాయి. పథకాలు, సేవలపై ప్రజలు కలెక్టర్‌కు ఏం విన్నవించినా.. వాటిని కలెక్టర్‌ ఆయా సెక్షన్లకు పంపిస్తారు.

పూర్తిస్థాయిలో ఆ ఫిర్యాదు, వినతికి ఒక రూపం తెచ్చాక జాయింట్‌ కలెక్టర్, కలెక్టర్‌ ఆమోదముద్ర వేస్తారు. ఈ సెక్షన్‌లే జిల్లాకు కీలకం.. ప్రస్తుతం జిల్లాల విభజనలో భాగంగా ఇంత వరకు కలెక్టర్‌ కార్యాలయంలోని 8 సెక్షన్లను నాలుగింటిగా కుదించి పరిపాలన సాగించేలా చర్యలు తీసుకుంటున్నారు.  

జిల్లాలో పురపాలన అందించేందుకు ప్రస్తుతం 8 సెక్షన్లను నాలుగింటిగా విభజించారు. ఎస్టాబ్లిష్‌మెంట్, అకౌంట్స్‌ అండ్‌ ఆడిట్‌ విభాగాలు గతంలో ఏ, బీ సెక్షన్లుగా ఉండేవి. ప్రస్తుతం ఆ రెండు సెక్షన్లను ఎస్టాబ్లిష్‌మెంట్‌ సెక్షన్‌గా మాత్రమే ఉంచారు. అలాగే ఆఫీస్‌ ప్రొసీజర్, ఎస్టాబ్లిష్‌మెంట్‌ అండ్‌ సర్వీస్‌ మేటర్, డిసిప్లీనరీ యాక్షన్స్, అకౌంట్స్, ఆడిటింగ్, శాలరీస్, పర్చేజ్, మెయింటెనెన్స్‌ శాఖలను దీనిలో కలిపారు. అదేవిధంగా ఈ, జీ, ఎఫ్‌ లలో నిర్వహించే ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్, ల్యాండ్‌ ఎక్విజేషన్, ల్యాండ్‌ రీఫారŠమ్స్‌ సెక్షన్లను ల్యాండ్‌ మ్యాటర్‌ సెక్షన్‌లుగా ఏర్పాటు చేశారు. ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్, అసైన్‌మెంట్, అవుట్‌సైడ్, ప్రొహిబిడెడ్, 22ఏ రిజిస్ట్రేషన్, ఫిషరీస్, సెటిల్‌మెంట్‌ రెగ్యులరైజేషన్స్, ఆల్‌ కోర్ట్‌ కేసెస్, ఫారెస్ట్‌ సెటిల్‌మెంట్స్, ఆర్‌ అండ్‌ ఆర్‌ అంశాలు, ల్యాండ్‌ రిలేటెడ్‌ మ్యాటర్స్‌ దీనిలో విలీనం చేశారు.  

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 
కేవలం సి సెక్షన్‌ను మాత్రం ఉంచి సి పేరు తొలగించి మెజిస్టీరియల్‌ సెక్షన్‌గా ఏర్పాటు చేశారు. ఈ సెక్షన్‌లో గతంలో సి సెక్షన్‌లో నిర్వహించే మెజిస్టీరియల్, సినిమాటోగ్రఫీ, కాస్ట్‌ వెరిఫికేషన్, లా అండ్‌ ఆర్డర్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు, లోకాయుక్త, హెచ్‌ఆర్‌సీ, ఎన్‌హెచ్‌ఆర్‌సీ, ఆర్టీఐ వంటివి నిర్వహించనున్నారు. డీ, హెచ్‌ సెక్షన్లను విలీనం చేసి కోఆర్డినేషన్‌ సెక్షన్‌గా ఏర్పాటు చేశారు. డి, హెచ్‌లో ఉన్న పనులు నేచురల్‌ కలామిటీస్, వాటర్‌ ట్యాక్స్, వెబ్‌లాండ్‌ ఇస్యూస్, ఆర్‌వోఆర్, కంప్యూటరైజేషన్‌ ఆఫ్‌ ల్యాండ్‌ రికార్డ్స్, ఈ–గవర్నెన్స్, ఆల్‌ ఎలక్షన్‌ వర్క్స్, ప్రొటోకాల్, గ్రీవెన్సెస్, స్పందన, సీఎంపీ వంటి అంశాలను ఏర్పాటు చేసి ఈ సెక్షన్‌లో పొందుపరిచారు. ఆయా సెక్షన్‌లలో ఇక నుంచి విధులు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.  

విభజనలో భాగంగా ఈ ఏర్పాట్లు చేశాం
ఇంతవరకు 8 సెక్షన్‌లుగా ఉన్న జిల్లా పరిపాలనను ప్రస్తుతం నాలుగు సెక్షన్‌లుగా ఏర్పాటు చేశాం. ప్రభుత్వం ఈ మేరకు జీవో సైతం విడుదలైంది. ఇక నుంచి 4 సెక్షన్‌ల ద్వారా ప్రజలకు అందాల్సిన అన్ని సేవలను అందించేందుకు చర్యలు తీసుకుంటాం. నాలుగు సెక్షన్లకు సూపరింటెండెంట్లను నియమించి ఆయా సెక్షన్‌ల ద్వారా కలెక్టరేట్‌ పరిపాలన చేపడతాం. 
– ప్రసన్న వెంకటేష్, కలెక్టర్‌   

మరిన్ని వార్తలు