మద్యం వినియోగాన్ని నిరుత్సాహ పరిచేందుకే..

18 Sep, 2020 21:34 IST|Sakshi

సాక్షి, విజయవాడ: మద్యం వినియోగాన్ని నిరుత్సాహ పరిచేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగా బార్‌ లైసెన్సులను పెంచుతున్నట్లు ప్రకటించింది. కాగా బార్‌ లైసెన్స్‌ రిజిస్ట్రేషన్ చార్జీలను 10 శాతం పెంచుతూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు బార్ల లైసెన్స్ పై 20 శాతం కోవిడ్ ఫీజులను వసూలు చేయాలని నిర్ణయించింది. దేశంలో తయారైన విదేశీ మద్యం, బీర్లు, రెడీ టు డ్రింక్ మద్యంపైనా 10 శాతం ఏఈఆర్టీ విధిస్తూ నోటిఫికేషన్‌ విడుదల చేస్తు, 2021 జూన్ 30 వరకు బార్లను కొనసాగిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.
 

మరిన్ని వార్తలు