పోలీస్‌ స్టేషన్ల పరిధి మార్పు.. ప్రభుత్వం ఉత్తర్వులు

25 Feb, 2022 12:29 IST|Sakshi

మార్చి 1 నుంచి అమల్లోకి.. 

ఎస్పీ ఆదేశాలమేరకు గ్రామాల్లో అవగాహన కల్పిస్తున్న పోలీసులు

సాక్షి, ఒంగోలు: జిల్లాలో పలు గ్రామాల పోలీసుస్టేషన్ల పరిధిని మార్పు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. జిల్లాల విభజన సందర్భంగా జీవో ఎంఎస్‌ నెంబర్‌ 93 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు అమలు చేసే క్రమంలో ప్రస్తుతం కొన్ని పోలీసుస్టేషన్ల పరిధిలో ఉన్న ఇతర రెవెన్యూ మండలాల గ్రామాలను ఆయా రెవెన్యూ మండలాల పరిధిలోని పోలీసుస్టేషన్‌కు కింద మార్పు చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ మేరకు మార్పులకు గురైన గ్రామాలు ఏ పోలీసుస్టేషన్‌ పరిధిలో చేరాయనే దానిపై సంబంధిత గ్రామాల్లో పోలీసు అధికారులు గ్రామసభలు నిర్వహించి అవగాహన కల్పించారు. ఈ గ్రామాలు మార్చి 1వ తేదీ నుంచి సంబంధిత మండలానికి సంబంధించిన పోలీసుస్టేషన్ల పరిధిలోకి రానున్నాయి.  

మారిన గ్రామాలు ఇవే.. 
రాచర్ల రెవెన్యూ మండలానికి చెందిన యడవల్లి, రంగారెడ్డిపల్లి, అంకిరెడ్డిపల్లి, చెర్లోపల్లి, వద్దులవాగుపల్లి, మేడంవారిపల్లి, గుడిమెట్ల, కొత్తపల్లి, రామాపురం, అచ్చంపల్లి గ్రామాలు రాచర్ల పోలీసుస్టేషన్‌ పరిధిలో చేరాయి. గిద్దలూరు పోలీసుస్టేషన్‌ పరిధిలో ఉన్న కొమరోలు రెవెన్యూ మండలానికి చెందిన దద్దవాడ , నారాయణపల్లి, గుండ్రెడ్డిపల్లి, అలసందలపల్లి, గోవిందపల్లి, అక్కపల్లి, వెంకటంపల్లి, కంకరవారిపల్లి, పొట్టుపల్లి, తాటిచర్ల, హసనాపురం, నాగిరెడ్డిపల్లి, ముత్తరాసిపల్లి కొమరోలు పోలీసుస్టేషన్‌ పరిధిలోకి మారాయి. వేటపాలెం పీయస్‌ పరిధిలోని ఎన్‌జీపాడు రెవెన్యూ మండలానికి చెందిన మట్టిగుంట (ఎన్‌జీపాడు పరిధిలోకి), ఇంకొల్లు పీయస్‌ పరిధిలో ఉన్న ఎన్‌జీపాడు రెవెన్యూ మండలానికి చెందిన తిమ్మసముద్రం, మద్దిరాల, ముప్పాల గ్రామాలు ఎన్‌జీపాడు పోలీసుస్టేషన్‌ పరిధిలోకి చేరాయి.

చదవండి: (తిరుమల: టీటీడీ కీలక నిర్ణయం) 

కందుకూరు టౌన్‌ పీయస్‌ పరిధిలో ఉన్న మోపాడు, కంచరగుంట గ్రామాలు కందుకూరు రూరల్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలోకి చేరాయి. కందుకూరు టౌన్‌ పీయస్‌ పరిధిలో ఉన్న వలేటివారిపాలెం రెవెన్యూ మండలానికి చెందిన కాకుటూరు, బడేవారిపాలెం, నేకునాంపురం (అత్తింటివారిపాలెం), నూకవరం, పోకూరు, సింగమనేనిపల్లి, కొండారెడ్డిపల్లి, నలదలపూర్‌ గ్రామాలు వలేటివారిపాలెం పోలీసుస్టేషన్‌ పరిధిలోకి మారాయి. గుడ్లూరు పీయస్‌ పరిధిలో ఉన్న లింగసముద్రం రెవెన్యూ మండలానికి చెందిన చిన్నపవని, పెద్ద పవని, ముత్యాలపాడు, ముత్తంవారిపల్లి, అంగిరేకులపాడు, మేదరమెట్లవారిపాలెం, అన్నెబోయినపల్లి గ్రామాలు లింగసముద్రం పీఎస్‌ పరిధిలోకి వచ్చాయి. 

మరిన్ని వార్తలు