రాష్ట్రాభివృద్ధికి వైఎస్సార్ విశేషమైన కృషి చేశారు: గవర్నర్‌

1 Nov, 2022 11:46 IST|Sakshi

సాక్షి, విజయవాడ: వైఎస్సార్‌ తన మార్క్‌ పాలనతో జాతీయస్థాయిలో గుర్తింపు పొందారని ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ తెలిపారు. అలాంటి మహానేత పేరుతో అవార్డులు ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని వరుసగా రెండో ఏడాది 'వైఎస్సార్‌ జీవిత సాఫల్య, వైఎస్సార్‌ సాఫల్య-2022' పురస్కారాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్, విశిష్ట అతిథిగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ఆత్మీయ అతిథిగా దివంగత  ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి సతీమణి వైఎస్‌ విజయమ్మ హాజరయ్యారు.

ఈ సందర్భంగా గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ మాట్లాడుతూ.. 'ఆంధ్రప్రదేశ్ గొప్ప సాంస్కృతిక వారసత్వం కలిగింది. బహుళ ప్రతిభలు కలగలిసిన రాష్ట్రం మనది. కళలు, చేతివృత్తులు, కూచిపూడి నృత్యం ఇక్కడ ప్రసిద్ధి చెందాయి. వెయ్యేళ్లు పైబడ్డ తెలుగు భాష చరిత్ర కలిగి ఉంది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, గొప్ప వ్యక్తులు కలిగిన నేల ఆంధ్రప్రదేశ్. 

దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి రాష్ట్రాభివృద్ధికి విశేష కృషి చేశారు. 4 సార్లు ఎంపీ, 5 సార్లు ఎమ్మెల్యేగా పని చేశారు. దేశ చరిత్రలోనే వైఎస్సార్ అరుదైన నాయకుడిగా నిలిచారు. ప్రజల సమస్యలను పాదయాత్ర ద్వారా తెలుసుకున్న గొప్ప నాయకుడు వైఎస్సార్. సీఎం అవ్వగానే సంక్షేమ కార్యక్రమాలతో పేదలకు మేలు చేశారు. ఉచిత విద్యుత్, ఆరోగ్య శ్రీ, 108, పావలా వడ్డీ, గృహ నిర్మాణం, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అమలు చేశారు. గ్రామీణ పేదరికం నిర్మూలనకు కృషి చేశారు. జలయజ్ఞం ద్వారా లక్షలాది ఎకరాలకు సాగు నీరు అందించారు. రైతుల ఆదాయం రెట్టింపు అయ్యేలా కృషి చేశారని' గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ తెలిపారు. 

చదవండి: (అవార్డులు అందుకుంటున్న ప్రతి ఒక్కరికీ అభినందలు: సీఎం జగన్‌)

మరిన్ని వార్తలు