అగ్నిప్ర‌మాదం : ర‌మేష్ ఆసుపత్రి నిర్ల‌క్ష్యం వ‌ల్లే!

10 Aug, 2020 14:26 IST|Sakshi

సాక్షి, విజ‌య‌వాడ : విజ‌య‌వాడ‌లోని ర‌మేష్ ఆస్ప‌త్రి కోవిడ్ కేర్ సెంట‌ర్‌గా వినియోగిస్తున్న హోట‌ల్ స్వ‌ర్ణ ప్యాలెస్‌లో ఆదివారం వేకువ‌జామున జ‌రిగిన అగ్నిప్ర‌మాద ఘ‌ట‌న‌పై విచార‌ణ కొన‌సాగుతోంది. దీనికి సంబంధించి ప్ర‌భుత్వం రెండు క‌మిటీల‌ను నియ‌మించింంది. స్వ‌ర్ణ ప్యాలెస్‌తో పాటు ప్రైవేటు ఆసుపత్రుల ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హిస్తున్న కోవిడ్ కేర్ సెంట‌ర్ల‌పై ప్ర‌భుత్వం దృష్టి పెట్టింది. భ‌ద్ర‌తా ప్ర‌మాణాల‌పై 48 గంట‌ల్లోగా పూర్తి నివేదిక ఇవ్వాలని ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసింది. మ‌రోవైపు ర‌మేష్ ఆసుప‌త్రి బాధితులు ఒక్కొక్కరుగా బ‌య‌ట‌కు వ‌చ్చి త‌మ‌కు జ‌రిగిన అన్యాయాన్ని అధికారుల దృష్టికి తీసుకొస్తున్నారు. (బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం)

బయటపడుతున్న రమేష్ ఆసుపత్రి అరాచ‌కాలు
అనారోగ్యంతో ఉన్న త‌న త‌ల్లి చావుకు ఆసుప‌త్రి సిబ్బందే కార‌ణమని ర‌మేష్ ఆసుప‌త్రి బాధితుడు ఆనంద్ ఆరోపించాడు. స్టంట్ వేసి 10 సంవ‌త్స‌రాల వ‌ర‌కు ఇబ్బంది ఉండ‌ద‌ని ఆసుపత్రి సిబ్బంది హామీ ఇచ్చార‌ని, కానీ ఆప‌రేష‌న్ జ‌రిగిన గంట‌లోనే తన త‌ల్లి చ‌నిపోయింద‌ని తెలిపాడు. ర‌క్తం ఎక్కించ‌కుండానే స‌ర్జరీ నిర్వ‌హించార‌ని, ఆసుప‌త్రి నిర్ల‌క్ష్యం కార‌ణంగానే త‌న త‌ల్లి చ‌నిపోయింద‌ని వాపోయాడు. ర‌మేష్ ఆసుప‌త్రి నిర్ల‌క్ష్యంపై బాధితుడు ఆనంద్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. డ‌బ్బు సంపాదనే ద్యేయంగా ర‌మేష్ ఆసుప‌త్రి ప‌నిచేస్తోంద‌ని, నిన్న జరిగిన అగ్ని ప్రమాదం కూడా ఆసుపత్రి నిర్వాక‌మేన‌ని ఆరోపించాడు. (విషాద 'జ్వాల')

మరిన్ని వార్తలు