అధికారులపై టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు నోటి దురుసు

28 Aug, 2021 15:18 IST|Sakshi

నర్సీపట్నం మహిళా తహశీల్ధార్‌ పై అయ్యన్న అసభ్య వ్యాఖ్యలు

సాక్షి, విశాఖపట్నం: మరోసారి అధికారులపై టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు నోటి దురుసుతో ప్రవర్తించారు. మహిళా తహశీల్ధార్‌ను ఉద్దేశించి అసభ్యంగా మాట్లాడారు. అధికారులను కించపరిచేలా దొంగలతో కుమ్మక్కయ్యారంటూ వ్యాఖ్యానించారు. అధికారుల పట్ల హేళనగా మాట్లాడారు. అయ్యన్న వ్యాఖ్యలపై తహశీల్ధార్‌ కలత చెందారు.

గిరిజన మహిళా తహశీల్ధార్‌పై ఈ రకంగా వ్యాఖ్యలు చేయడంపై ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. గతంలో కూడా అయ్యన్నపాత్రుడు నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్‌పై కూడా దురుసుగా మాట్లాడారని స్థానికులు గుర్తు చేసుకుంటున్నారు. ఓ సీనియర్ ప్రజా ప్రతినిధిగా చెప్పుకునే అయ్యన్న తీరు మారకపోవడం దారుణం అంటున్నారు.

చదవండి:
కీచకుడిగా మారిన టీడీపీ వార్డు కౌన్సిలర్‌..
విశాఖ జిల్లాలో టీడీపీ కార్యకర్తల వీరంగం

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు