బీసీ-డీగా మున్నూరు కాపులు.. ఏపీ సర్కార్‌ కీలక ఉత్తర్వులు

20 Aug, 2022 19:33 IST|Sakshi

సాక్షి, అమరావతి: మున్నూరు కాపు కులస్తులకు బీసీ-డీ కింద ఏపీ ప్రభుత్వం గుర్తింపు ఇచ్చింది. ఈ మేరకు బీసీ-డీ కింద కుల ధ్రువీకరణ పత్రాలకు ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై కాపు కార్పొరేషన్‌ ఛైర్మన్‌ అడపా శేషు హర్షం వ్యక్తం చేశారు. 

కాగా, ఇటీవల గోదావరి జిల్లాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి మున్నూరు కాపులు వినతి పత్రం ఇచ్చారు. దీనిపై స్పందించిన సీఎం జగన్‌.. బీసీ-డీ సర్టిఫికెట్‌ ఇచ్చేందుకు ఉత్తర్వులు జారీకి ఆదేశాలు ఇచ్చారు.

చదవండి: (మంత్రి ఆర్కే రోజాని మర్యాదపూర్వకంగా కలిసిన పీవీ సింధు)

మరిన్ని వార్తలు