టీడీపీ సంబరాల్లో సచివాలయ ఉద్యోగి

18 Feb, 2021 05:21 IST|Sakshi
సర్పంచ్‌గా ఎన్నికైన సందీప్‌ను సన్మానిస్తున్న సచివాలయ ఉద్యోగి బాలరాజు (వృత్తంలో) 

సాక్షి, కళ్యాణదుర్గం‌: టీడీపీ విజయోత్సవ ర్యాలీలో అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలంలోని పాలవెంకటాపురం సచివాలయ సర్వేయర్‌ బాలరాజు హల్‌చల్‌ చేశారు. ఆ దృశ్యాలు బుధవారం వెలుగులోకి వచ్చాయి. ఇటీవల సర్పంచ్‌ ఫలితాలు వెలువడటంతో 13వ తేదీ సాయంత్రం టీడీపీ నాయకులు నాగిరెడ్డిపల్లిలో సంబరాలు చేసుకున్నారు. బాల రాజు స్వగ్రామం నాగిరెడ్డిపల్లి. సర్పంచ్‌గా గెలుపొందిన టీడీపీ మద్దతుదారు కురుబ సందీప్‌ను బాలరాజు స్వయంగా సన్మానిం చారు. విజయోత్సవ ర్యాలీలో ఈలలు వేస్తూ హడావుడి చేశారు. ప్రభుత్వ పథకాలను పార్టీల కతీతంగా పేదలకు అందించేందుకు ప్రభుత్వం కృషిచేస్తున్న సమయంలో ఓ ఉద్యోగి ఇలా వ్యవహరించడం చర్చనీయాంశంగా మారింది.  

చదవండి: (టీడీపీకి ఓటేయలేదని చెల్లెల్ని ఇంట్లోంచి గెంటేసిన అన్న)

మరిన్ని వార్తలు