నేటి నుంచి గ్రూప్‌–1 మెయిన్స్

14 Dec, 2020 03:48 IST|Sakshi

ఈ నెల 20 వరకు నిర్వహణ

సాక్షి, అమరావతి: గ్రూప్‌–1 మెయిన్స్‌ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ఏపీపీఎస్సీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నెల 20 వరకు ఏడు సెషన్లలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తారు. తొలిసారిగా ట్యాబ్‌ ఆధారిత ఆన్‌లైన్‌ ప్రశ్నపత్రాలను అభ్యర్థులకు అందించనున్నారు. ఈ పరీక్షలకు 9,679 మంది దరఖాస్తు చేసుకోగా 8,099 మంది హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. అభ్యర్థులు హాల్‌టికెట్‌తో పాటు అధికారిక ఒరిజినల్‌ ఫొటో గుర్తింపు కార్డును కూడా వెంట తెచ్చుకోవాలి.

కోవిడ్‌ నిబంధనల మేరకు అభ్యర్థులను లోపలకు అనుమతిస్తారు. అభ్యర్థులు మాస్కులు, గ్లవుజ్‌లు ధరించడంతోపాటు శానిటైజర్‌ను తెచ్చుకోవాలి.  సెల్‌ఫోన్లు, ట్యాబ్‌లు, కాలిక్యులేటర్లు, ఇతర ఎల్రక్టానిక్‌ పరికరాలను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించరు. అభ్యర్థులు తమ సీట్ల వద్ద ఏర్పాటు చేసిన ట్యాబులను పరీక్షకు ముందు ప్రకటించే పాస్‌వర్డ్‌ ద్వారా ఓపెన్‌ చేసి ప్రశ్నపత్రాలను చూడొచ్చు. ప్రశ్నలు ఇంగ్లిష్, తెలుగు భాషల్లో ఉంటాయి. అభ్యర్థులు తాము ఎంచుకున్న మాధ్యమంలో అన్ని పేపర్లను రాయాల్సి ఉంటుంది. రోజూ ఉదయం 8.45 నుంచి 9.30 గంటల వరకు పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు. ఆలస్యంగా వచ్చే వారి కోసం మరో 15 నిమిషాలు గ్రేస్‌ పీరియడ్‌ ఉంటుంది. ఆ తర్వాత వచ్చే వారిని పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించబోమని ఏపీపీఎస్సీ కార్యదర్శి పీఎస్సార్‌ ఆంజనేయులు స్పష్టం చేశారు. 

మరిన్ని వార్తలు