పోలవరం నిర్వాసితుల గృహ ప్రవేశాలు

20 Apr, 2022 08:25 IST|Sakshi
కాలనీని ప్రారంభిస్తున్న కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌

రంపచోడవరం(అల్లూరి సీతారామరాజు జిల్లా): పోలవరం ప్రాజెక్ట్‌ నిర్వాసితులు పునరావాస కాలనీలకు తరలివచ్చారు. అల్లూరి సీతారామరాజు జిల్లా గంగవరం మండలం నేలదోనెలపాడులో నిర్మించిన కాలనీలను కలెక్టర్‌ సుమిత్‌కుమార్, ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి, ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్‌ (అనంతబాబు) మంగళవారం ప్రారంభించారు. దేవీపట్నం మండలం కొండమొదలు పంచాయతీ పరిధిలోని 8 గ్రామాల గిరిజనులకు ఇక్కడ ఆశ్రయం కల్పించారు.

చదవండి: మేల్కొని.. కలగంటున్న రామోజీ

వారంతా మంగళవారం గృహ ప్రవేశాలు చేశారు. కాగా, పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణం కారణంగా దేవీపట్నం మండలంలో 48 గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. వీటిలో దేవీపట్నం, తొయ్యేరు, వీరవరం, రమణయ్యపేట గ్రామాల గిరిజనులు పునరావాస కాలనీలకు గతంలోనే చేరుకున్నారు. కొండమొదలు పంచాయతీ పరిధిలోని 8 గ్రామాలకు పునరావాసం కల్పించడం ద్వారా దేవీపట్నం మండలంలో ముంపునకు గురవుతున్న అన్ని గ్రామాలను పునరావాస కాలనీలకు తరలించినట్టయింది. గోకవరం మండలం కృష్ణునిపాలెంలో గిరిజనేతర నిర్వాసితులకు పునరావాసం కల్పించారు.  

మరిన్ని వార్తలు