ఎగ్జిబిషన్‌లో అగ్నిప్రమాదం.. టీడీపీ మాజీ మంత్రి హస్తం?

10 May, 2022 15:08 IST|Sakshi
( ఫైల్‌ ఫోటో )

సాక్షి, గుంటూరు:  జిల్లాలోని గుంట గ్రౌండ్లో నడుస్తున్న ఎగ్జిబిషన్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా ఎగ్జిబిషన్‌లో మంటలు చెలరేగడంతో.. ఆ ప్రాంతమంతా అల్లకల్లోలంగా మారింది. ఈ తరుణంలో మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపు చేశారు. 

అయితే తెలుగుదేశం నేత,  మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఎగ్జిబిషన్ తగులబెట్టించారని ఆరోపిస్తున్నారు ఎగ్జిబిషన్‌ నిర్వాహకులు. ఆర్నెళ్ల నుంచి నక్కా ఆనంద్ బాబు అతని అనుచరులు తమను వేధిస్తున్నారని నిర్వాహకులు చెప్తున్నారు. నక్కా ఆనంద్ బాబు అనుచరులు మధ్యాహ్నం వచ్చి నిప్పంటించి తగులబెట్టారని నిర్వాహకులు అంటున్నారు. ఈ మేరకు నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు