వైజాగ్‌.. ది ల్యాండ్‌ ఆఫ్‌ లవ్‌

3 Aug, 2020 08:32 IST|Sakshi

విశాఖ వైభవంపై ట్విట్టర్‌లో ‘స్లోగన్‌’ కాంపిటీషన్‌ 

జీవీఎంసీ కమిషనర్‌ పిలుపునకు వెల్లువెత్తిన సందేశాలు 

సాక్షి, విశాఖపట్నం: విశాఖ నగరం.. సిటీ ఆఫ్‌ డెస్టినీ.. పర్యాటకుల స్వర్గధామంగా పేరొందిన వైజాగ్‌.. ప్రకృతి అందాలకు నెలవు. కనుచూపు మేర కనువిందు చేసే పచ్చని కొండలు.. నీలి సంద్రం.. మనసు దోచే సహజ అందాల కలబోత. సాగర తీర సొగసులకు ఫిదా అవ్వని వారంటూ ఎవరూ ఉండరు. అందుకే.. విశాఖ విశ్వనగరిగా మారింది. ఇప్పుడు కార్యనిర్వాహక రాజధానిగా రూపాంతరం చెందుతోంది. ఈ నేపథ్యంలో.. విశాఖ వైభవాన్ని మరింత చాటేందుకు జీవీఎంసీ కమిషనర్‌ జి.సృజన సోషల్‌ మీడియాను వేదికగా మలచుకున్నారు. అలరారే సాగరతీర అందాలతో ఉన్న ఫొటోను ట్వీట్‌ చేసి.. విశాఖపట్నంపై స్లోగన్స్‌ రాయండి... టాప్‌ త్రీ స్లోగన్స్‌కు ప్రశంసలు అందిస్తాం. అంటూ పోస్ట్‌ చేశారు. (విశాఖ విజయీభవ.. రాజధానిగా రాజముద్ర)

అసలే వాహ్‌.. వైజాగ్‌ అంటూ ట్విటర్‌లో అత్యధికంగా పోస్టులు వస్తున్న నేపథ్యంలో కమిషనర్‌ పిలుపునకు విశాఖ ప్రజలతో పాటు రాష్ట్రం నలుదిశల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా.. 1084 లైక్స్‌తో పాటు 154 మంది రీట్వీట్‌ చేశారు. ఇక 303 మంది తమ కవి హృదయాన్ని వెల్లడిస్తూ.. విశాఖ అందాలపై షార్ట్‌ అండ్‌ స్వీట్‌ కవితలను ఇంగ్లిష్‌ హిందీ భాషల్లో పోస్ట్‌ చేశారు.

వాటిలో కొన్ని మెచ్చుతునకలివీ...
ఎస్‌జే బాబు– ది ల్యాండ్‌ ఆఫ్‌ లవ్‌.. హోప్‌ అండ్‌ డ్రీమ్స్‌.. ద గేట్‌ వే ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌.. వైజాగ్‌ పట్టణం.. ఆంధ్రుల స్వప్నాల చిహ్నం 
రాఘవ– విశాల మనసులున్న పట్నం.. విశాఖపట్నం
సంతోష్‌బాబు ఎస్‌ఎస్‌ఎంబీ – విశాఖపట్నం.. అచీవ్‌ యువర్‌ డ్రీమ్స్‌ లైక్‌ ద సైలెంట్‌ వేవ్స్‌.. 
చెగువీరా– విశాఖపట్నం.. ద ప్లేస్‌ ఫర్‌ పీస్‌.. ద ప్లేస్‌ ఫర్‌ లవ్‌.. ద ప్లేస్‌ ఫర్‌ కామన్‌ పీపుల్‌ 
మోహన్‌– అమ్మ.. ఆవకాయ్‌.. వైజాగ్‌ బీచ్‌ ఎప్పుడూ బోర్‌ కొట్టవు 
త్రిలోక్‌ చంద్ర– కలలో స్వర్గానికి ఇలలో విశాఖ మార్గం.. 
వీరబాబు– సాగర తీరాన కార్యనిర్వాహక రాజధాని.. కృష్ణమ్మ చెంత శాసన రాజధాని.. చారిత్రక కర్నూలులో న్యాయ రాజధాని.. ప్రాంతాల మధ్య ఇక చెక్కు చెదరని అనుబంధాలకు తిరుగులేని పునాది. 
రవికుమార్‌– విశాఖ సాగరతీరం.. భారత మాతకు మణిహారం 
ఏఎన్‌వీఎల్‌ శ్రీకాంత్‌– బిల్డింగ్‌ ఏ బ్యూటిఫుల్‌ సిటీ నాట్‌ జస్ట్‌ బై బ్రిక్‌ బై బ్రిక్‌.. బట్‌ బై హార్ట్‌ బై హార్ట్‌.. 
సాయిప్రదీప్‌ పోలెపల్లి– సాగరతీర మెరిక.. మన విశాఖ, ప్రకృతి
సౌందర్య దీపిక– మన విశాఖ, రమణీయ వీచిక.. మన విశాఖ. 
శశాంక్‌ శ్రీధరాల– ల్యాండ్‌ ఆఫ్‌ హోప్‌ అండ్‌ సిటీ ఆఫ్‌ డ్రీమ్స్‌ రైజింగ్‌ స్టేట్‌ ఆంధ్రప్రదేశ్‌.. రైజింగ్‌ స్టార్‌ సిటీ విశాఖప ట్నం 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా