రేపటి నుంచి తిరుమలలో హనుమజ్జయంతి వేడుకలు 

3 Jun, 2021 18:48 IST|Sakshi

టీటీడీ అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి 

తిరుమల : తిరుమలలోని ఆకాశగంగ ప్రాంతం శ్రీ హనుమంతుని జన్మ స్థలమని టీటీడీ కమిటీ ప్రకటించిన నేపథ్యంలో ఆకాశగంగ వద్ద ఈ నెల 4వ తేదీ నుంచి 8వ తేదీ దాకా హనుమజ్జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తామని అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి చెప్పారు. తిరుమల అన్నమయ్య భవనంలో బుధవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. టీటీడీ పంచాంగంలో నిర్దేశించిన ప్రకారం ప్రతి ఏటా చేసే కార్యక్రమాలు యథాతథంగా చేస్తామన్నారు.  

కాగా, అలిపిరి నుంచి తిరుమలకు వెళ్లే నడకదారి నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేస్తామని ధర్మారెడ్డి చెప్పారు. నడక దారి పైకప్పు నిర్మాణం పనులు వేగంగా చేయడం కోసం జూలై 30 వరకు భక్తులను అనుమతించడం లేదన్నారు. తిరుమలకు నడచి రావాలనుకునే భక్తులు శ్రీవారి మెట్టు మార్గంలో రావాలని ఆయన కోరారు. ఇందుకోసం తిరుపతి రైల్వే స్టేషన్, అలిపిరి నుంచి శ్రీవారి మెట్టు వరకు ఉచిత బస్సులు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు