రమ్య హత్య కేసు: హెడ్‌ కానిస్టేబుల్‌ ధైర్య సాహసాలు

17 Aug, 2021 19:01 IST|Sakshi

శభాష్‌ రఫీ

నిందితుడు శశికృష్ణను పట్టుకోవడంలో హెడ్‌కానిస్టేబుల్‌ చొరవ 

ముప్పాళ్ళ: జిల్లాలో సంచలనం సృష్టించిన బీటెక్‌ విద్యార్థిని రమ్య హత్య కేసులో నిందితుడైన శశికృష్ణను పట్టుకోవటంలో హెడ్‌ కానిస్టేబుల్‌ చాకచక్యం ప్రదర్శించారు. ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటున్నారు. హత్యానంతరం పరారైన నిందితుడు నరసరావుపేట మండలం ములకలూరు గ్రామ సమీపంలో ఉన్నట్టుగా ఫోన్‌ సిగ్నల్‌ ద్వారా గుర్తించిన పోలీసు ఉన్నతాధికారులు ముప్పాళ్ల, నరసరావుపేట పోలీసులకు సమాచారం ఇచ్చారు. ముప్పాళ్లలో స్టేషన్‌ విధుల్లో ఉన్న హెడ్‌కానిస్టేబుల్‌ మహ్మద్‌రఫీ తన స్వగ్రామం కూడా పక్కనే ఉన్న పమిడిపాడు కావటంతో హుటాహుటిన నిందితుడిని పట్టుకునేందుకు బయలుదేరారు. చదవండి: గాంధీ ఆసుపత్రి అత్యాచార ఘటనలో ట్విస్ట్ 

ములకలూరు పొలాల్లో ఉన్నట్లుగా గుర్తించి అతన్ని అదుపులోకి తీసుకునేందుకు యత్నించే క్రమంలో నిందితుడు తనవద్ద నున్న కత్తితో చేతిపైన, గొంతుపైన గాయపరుచుకొని ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టాడు. హెడ్‌కానిస్టేబుల్‌ రఫీని కూడా కత్తితో బెదిరించాడు. అయినా రఫీ వెనుకడుగు వేయకుండా చాకచక్యంగా తోటి సిబ్బంది సాయంతో నిందితుడిని వెనుకవైపుగా వెళ్లి అదుపులోకి తీసుకున్నారు.

నిందితుడిని పట్టుకోవడంలో ధైర్యసాహసాలు ప్రదర్శించిన రఫీని ఇన్‌చార్జ్‌ డీఐజీ రాజశేఖర్, రూరల్‌ ఎస్పీ విశాల్‌గున్నీ, అర్బన్‌ ఎస్పీ ఆరీఫ్‌ హఫీజ్, అదనపు ఎస్పీ రిశాంత్‌రెడ్డితో పాటు సత్తెనపల్లి డీఎస్పీ విజయభాస్కరరెడ్డి, రూరల్‌ సీఐ నరసింహారావు ఫోన్‌లో అభినందించారు. ఇది మా స్టేషన్‌కే గర్వకారణమని ఎస్సై ఎమ్‌.పట్టాభిరామయ్య ఆనందం వ్యక్తం చేశారు.

ఇవీ  చదవండి:
హైదరాబాద్‌ నగర వాసులకు తీపి కబురు
ఇడ్లీ, పూరీ అంటే ఇష్టం.. దోశ, వడ కూడా..

 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు