నిత్యపెళ్లికొడుకు లీలలు; నలుగురు భార్యలు, ఐదుగురు పిల్లలు.. తాజాగా మరో పెళ్లికి రెడీ

4 Oct, 2021 13:01 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నం పోలీస్‌ శాఖలో నిత్య పెళ్లికొడుకు ఆరాచకాలు బట్టబయలయ్యాయి. సీసీఆర్‌బీ హెడ్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న అప్పలరాజు మాయమాటలు చెప్పి మోసం చేస్తూ ఇప్పటికి నలుగురు మహిళలను పెళ్లిచేసుకున్నాడు. ఒకరికి తెలియకుండా మరొకరిని వివాహం చేసుకొని అయిదుగురు పిల్లలకు తండ్రి అయ్యాడు. వీరిలో పద్మ అనే మహిళకు నాలుగు సార్లు అబార్షన్‌ కూడా చేయించాడు. తాజాగా మరో మహిళ కానిస్టేబుల్‌తో వివాహానికి సిద్ధమయ్యాడు. ఈ విషయం తెలిసిన పద్మ నిత్య పెళ్లిళ్ల నిర్వాకంపై కానిస్టేబుల్‌ అప్పలరాజును నిలదీసింది.

కానిస్టేబుల్‌ అప్పలరాజుపై దిశా పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో నిత్య పెళ్లికొడుకు వ్యవహారం వెలుగులోకి వచ్చింది.  పోలీసులతోపాటు మహిళ చేతన స్వచ్చంధ సంస్థ కూడా స్పందించింది. సీసీఆర్‌బీ హెడ్ కానిస్టేబుల్ అప్పలరాజు బండారం బయటపెట్టి, మోసపోయిన మహిళాలకు అండగా ఉంటామని మహిళ చేతన చైర్‌పర్సన్‌ కత్తి పద్మ తెలిపారు. కానిస్టేబుల్‌ను విధుల నుంచి తొలగించి అతనిపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని పద్మ డిమాండ్‌ చేశారు.
 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు