ఏపీ: ఈ జిల్లాలపై తుపాను తీవ్ర ప్రభావం: ఐఎండీ

10 May, 2022 21:19 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం/అమరావతి:  ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అసని తుపాను నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. తుపాను సహాయక చర్యల కోసం నేవీ సిద్ధమైంది. 19 వరద సహాయక బృందాలతో పాటు 6 డైవింగ్‌ బృందాలు సిద్ధమయ్యాయి. తుపాను ప్రభావిత జిల్లాల్లో కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేశారు.

ఆ జిల్లాలపై తుపాను తీవ్ర ప్రభావం: ఐఎండీ
బాపట్ల జిల్లా సముద్ర తీరం ప్రాంతాల్లో హైఅలర్ట్‌ జారీ చేశారు. నిజాంపట్నం హార్బర్‌లో8వ నంబర్‌ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఈ తుపాను ప్రభావం కృష్ణా,  కాకినాడ, తూ.గో, ప.గో జిల్లాలపై ఉండే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. తుపాను ప్రభావంతో కోస్తాంధ్రాలో 75-95 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.

దీనిలో భాగంగా తుఫాన్ ప్రభావం జిల్లాపై ఎక్కువగా ఉండే అవకాశం ఉందని, సహాయక చర్యలకు సన్నద్ధం కావాలని అధికారులను జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదేశించారు. సఖినేటిపల్లి - ఐ. పోలవరం మధ్య తీరం దాటే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ సూచిస్తోందని కలెక్టర్‌ తెలిపారు. మరొకవైపు కృష్ణా, గుంటూరు జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ చేశారు. తుపాను ప్రభావంతో నెల్లూరు, కడప జిల్లాలో ఈదురు గాలులతో కూడిన వర్షం పడుతోంది. రేపు(బుధవారం) సాయంత్రంలోగా తీరం దాటే అవకాశం ఉంది. 

ఇంటర్‌ పరీక్షలు వాయిదా
బుధవారం జరగాల్సిన ఇంటర్‌ పరీక్షలు వాయిదా వేశారు. తుపాను కారణంగా పరీక్షను ఇంటర్‌ బోర్డు వాయిదా వేసింది. వాయిదా వేసిన ఇంటర్‌ పరీక్షను ఈనెల 25వ తేదీన నిర్వహించనున్నారు.

కంట్రోల్‌ రూమ్‌ నంబర్లు
మచిలీపట్నం కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూమ్‌ నంబర్లు 99086 64635, 08672 25257
మచిలీపట్నం ఆర్డీవో కార్యాలయంలో కంట్రోల్‌ రూమ్‌ నంబర్‌ 08672252486
కాకినాడ కలెక్టరేట్‌ కంట్రోల్‌ రూమ్‌ నంబర్‌ 18004253077
కాకినాడ ఆర్డీవో ఆఫీస్‌ కంట్రోల్‌ రూమ్‌ నంబర్‌ 0884-2368100
ఏలూరు కలెక్టరేట్‌ కంట్రోల్‌ రూమ్‌ నంబర్‌ 18002331077

మరిన్ని వార్తలు