అనంత, సత్యసాయి జిల్లాలో భారీ వర్షం.. సహాయక చర్యల్లో ప్రజాప్రతినిధులు

12 Oct, 2022 08:37 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం రాత్రి నుంచి అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షం కారణంగా వాగులు, వంకలు పొర్లిపొంగుతున్నాయి. భారీ వర్షాలు కురుస్తున్న క్రమంలో అనంతపురం నగరాన్ని వరద నీరు ముంచెత్తింది. 

ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

వరద నీటితో రుద్రంపేట, నడిమివంక, ఆదర్శ్‌నగర్‌ కాలనీలు జలమయమయ్యాయి. అధికారులు దాదాపు 300 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రంగస్వామయి నగర్‌లో చిక్కుకున్న కాలనీవాసులను బోట్ల సాయంతో రక్షించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ఎమ్మెల్యేలు అనంత వెంకటరామిరెడ్డి, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, ఎంపీ గోరంట్ల మాధవ్ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. 

మరోవైపు.. విజయవాడలో రెండు రోజులుగా ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. దీంతో, అధికారులు ఇంద్రకీలాద్రి ఘాట్‌రోడ్‌ను మూసివేశారు. ఆలయానికి వచ్చే భక్తులు మెట్లు, లిఫ్ట్‌ మార్గాల్లో రావాలని ఈవో భ్రమరాంబ సూచించారు. వాహనాలను కనకదుర్గనగర్‌లో నిలిపివేయాలని ఈవో స్పష్టం చేశారు. 

మరిన్ని వార్తలు