అల్పపీడన ప్రభావం.. ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు..

17 Aug, 2021 12:11 IST|Sakshi

అమరావతి: అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో అనేక చోట్ల భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో, ఒక మోస్తరు నుంచి భారీగా వర్షాపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ  తెలిపింది. కాగా, గత 24 గంటలలో ఏపీలో నమోదైన వర్షపాతం.. కృష్ణాజిల్లాలోని పుట్రేలో అత్యధికంగా 9.6 సెం.మీలు, పశ్చిమగోదావరి జిల్లాలోని పోతవరంలో 8.4 సెం.మీలు, విజయనగరం జిల్లాలో జియ్యమ్మ వలసలో 7.7 సెం.మీల వర్షం నమోదైంది. విశాఖలోని గొలుగొండలో  6 సెం.మీల వర్షపాతం నమోదైంది.

శ్రీకాకుళం జిల్లాలో 11.1 మి.మిలు, విజయ నగరం 5.9 మి.మీలు, విశాఖలో 6.8 మి.మీల వర్షపాతం నమోదైంది. అదేవిధంగా.. పశ్చిమగోదావరి జిల్లాలో 8.1, కృష్ణా జిల్లాలో 4.9మి.మీల వర్షపాతం నమోదవ్వగా.. చిత్తూరులో 4.1, అనంతపురంలో 4.మి.మీల వర్షం నమోదైంది.

భారీ వర్షాల ప్రభావంతో.. కృష్ణాజిల్లాలోని  తిరువూరు మండలంలోని చౌటపల్లి-కొత్తూరు గ్రామాల మధ్య ఎదుళ్ల వాగుపై వరద బీభత్సంగా ప్రవహిస్తుంది. దీంతో రెండు గ్రామాల మధ్య రాకపోకలు బంద్‌ అయ్యాయి. అదే విధంగా, గంపలగూడెం మండలం తోటమూల-వినగడప కట్టలేరు వాగుపై వరద ఉధృతి కొనసాగుతుంది. సమీప గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. 

మరిన్ని వార్తలు