కొనసాగుతున్న అల్పపీడనం..భారీ వర్ష సూచన

22 Nov, 2020 20:44 IST|Sakshi

బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం

రాగల 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం

రేపు, ఎల్లుండి ఏపీలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు

సాక్షి, విశాఖపట్నం : నైఋతి బంగాళాఖాతం మరియు దానిని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతాలలో అల్పపీడనం కొనసాగుతోంది.  రాగల 24 గంటలలో ఇది నైఋతి బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉంది. అనంతరం మరో 24 గంటలలో తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.  దీని ప్రభావంతో  సోమ, మంగళవారాల్లో ఆంధ్రప్రదేశ్‌లోని  పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.  ఈ తుపాను వాయువ్య దిశగా పయనించి తమిళనాడు - పుదుచ్చేరి తీరాల వద్ద కరైకల్ - మహాబలిపురంల మధ్య ఈ నెల 25న తీరం దాటే అశకాశం ఉంది. 

రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచన :  

ఉత్తర కోస్తాంధ్ర:  

  • ఆది, సోమవారాల్లో  ఉత్తర కోస్తాఆంధ్రాలో  తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండుచోట్ల  కురిసే అవకాశం ఉంది. 
  • ఎల్లుండి ఉత్తర కోస్తాఆంధ్రాలో ఉరుములు మెరుపులు తోపాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండుచోట్ల  కురిసే అవకాశం ఉంది.

 దక్షిణ కోస్తాంధ్ర :

  • ఈరోజు  దక్షిణ కోస్తాఆంధ్రాలో  తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండుచోట్ల  కురిసే అవకాశం ఉంది.
  • సోమవారం  దక్షిణ కోస్తాఆంధ్రాలో  తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల  కురిసే అవకాశం ఉంది.
  • మంగళవారం  దక్షిణ కోస్తాఆంధ్రాలో ఉరుములు మెరుపులు తోపాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. 
  • నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

రాయలసీమ : 

  • సోమవారం  రాయలసీమలో తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండుచోట్ల  కురిసే అవకాశం ఉంది.
  • మంగళవారం రాయలసీమలో ఉరుములు మెరుపులు తోపాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. 
  • చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
మరిన్ని వార్తలు