ఏపీ: రాగల మూడు రోజుల్లో అతి భారీ వర్షాలు

28 Nov, 2020 21:16 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: అగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. రాగల 48 గంటల్లో  అల్పపీడనం వాయుగుండంగా మారనుందని వాతావరణ శాఖ తెలిపింది. డిసెంబర్‌ 2న దక్షిణ తమిళనాడు-పాండిచ్చేరి మధ్య తీరందాటే అవకాశం ఉందని పేర్కొంది. రాగల 3 రోజుల్లో దక్షిణ కోస్తాంధ్రలో భారీ నుంచి అతిభారీ వర్షాలు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా