భారీ వ‌ర్ష‌సూచ‌న‌.. విస్తారంగా కురిసే అవ‌కాశం

4 Aug, 2020 10:34 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం : ఉత్త‌ర బంగాళాఖాతం ప‌రిస‌ర ప్రాంతాల్లో అల్ప‌పీడ‌నం ఏర్ప‌డింది. దానికి అనుబంధంగా 7.6 కిలోమీట‌ర్ల ఎత్తులో నైరుతి వైపు ఉప‌రిత‌ల ఆవ‌ర్త‌నం ఏర్ప‌డిన‌ట్లు విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. రాగ‌ల 24 గంట‌ల్లో అల్ప‌పీడ‌నం మ‌రింత బ‌ల‌ప‌డే అవ‌కాశ‌మున్న‌ట్లు వెల్ల‌డించింది. అల్ప‌పీడనం ప్ర‌భావంతో ద‌క్షిణ కోస్తా, ఉత్త‌ర కోస్తాలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ కేంద్రం అధికారులు పేర్కొన్నారు. కోస్తాంధ్ర తీరం వెంబ‌డి గంట‌కు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బ‌ల‌మైన ఈదురుగాలులు వీస్తున్నాయ‌ని , మ‌త్స‌కారులెవ‌రూ వేట‌కు వెళ్ల‌వ‌ద్ద‌ని హెచ్చ‌రించారు. 

మరిన్ని వార్తలు