నేడు ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన

10 Aug, 2020 06:56 IST|Sakshi

కొనసాగుతున్న అల్పపీడనం 

సాక్షి, విశాఖపట్నం: వాయువ్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఉత్తరాంధ్ర తీరానికి సమీపంలో వాయువ్య బంగాళాఖాతం, దాన్ని ఆనుకొని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆదివారం ఉదయం అల్పపీడనం ఏర్పడింది. ప్రస్తుతం ఇది ఉత్తర ఒడిషా, పశ్చిమ బెంగాల్‌ తీరాలకు సమీపంలోని వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా 5.8 కి.మీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో నేడు కోస్తా, రాయలసీమలో అక్కడక్కడా వర్షాలు కురిసే సూచనలున్నాయని విశాఖ వాతావరణ విభాగం వెల్లడించింది. సోమవారం ఉత్తరకోస్తాలో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి. అల్పపీడనం కారణంగా కోస్తా తీరం వెంబడి సోమ, మంగళవారాల్లో బలమైన గాలులు వీచే సూచనలున్నాయి. మత్స్యకారులెవ్వరూ వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు.  

మరిన్ని వార్తలు