సత్తెనపల్లి, పెద్దవడగూరులో భారీ వర్షం

30 Sep, 2020 11:29 IST|Sakshi

సాక్షి, అనంతపురం: జిల్లాలోని పెద్దవడగూరులో భారీ వర్షం కురుస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి పందుల వాగు పొంగి పొర్లుతోంది. భారీ నీటితో ప్రవహిస్తున్న వాగులో ఆర్టీసీ బస్సు చిక్కుకుంది. అక్కడే ఉన్న స్థానికులు ట్రాక్టర్‌ సాయంతో వాగులో నుంచి బస్సును సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారు. భారీ వర్షాలకు పెద్దవడగూరులో వందల ఎకరాల్లో పంటులు దెబ్బతిన్నాయి. పామిడి, పెద్దవడుగూరు మండలాల్లోని పలు గ్రామాల్లో వందలాది ఎకరాల్లో సాగుచేసిన పత్తి, వేరుశనగ పంట పొలాలు నీటమునిగాయి. పెద్దవడుగూరు సమీపంలో వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

గుంటూరు: జిల్లాలోని సత్తెనపల్లిలో మంగళవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. పలు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వెన్నాదేవి దగ్గర  వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో సత్తెనపల్లి-పిడుగురాళ్ల మార్గంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

మరిన్ని వార్తలు