ఇక వర్షాకాలమే...

10 Aug, 2021 02:50 IST|Sakshi

14 నుంచి పలు చోట్ల భారీ వర్షాలు

సాక్షి, విశాఖపట్నం : ఉత్తర భారతదేశంలో అల్పపీడన ప్రాంతం.. రుతుపవన ద్రోణితో కలిసి హిమాలయాల వైపుగా కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా రుతుపవనాలు చురుగ్గా మారుతున్నాయి. ఈ కారణంగా రాష్ట్రంలో వర్షాలు కురిసే రోజులు సమీపించాయి. ఈ నెల 14వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల భారీ వర్షాలు పడే సూచనలున్నాయి.

మరోవైపు రాయలసీమ మీదుగా ఉపరితల ద్రోణి, ఉభయగోదావరి జిల్లాల మీదుగా  సోమవారం మరో ద్రోణి ఏర్పడింది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో రానున్న రెండు రోజుల పాటు అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. వాయువ్య గాలుల ప్రభావంతో సోమవారం వివిధ ప్రాంతాల్లో ఎండలు విజృంభించాయి. మంగళవారం తర్వాత నుంచి ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది.  

మరిన్ని వార్తలు