19న మరో అల్ప పీడనం: వాతావరణ శాఖ

17 Aug, 2020 08:14 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో మరో రెండు రోజులపాటు పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర కోస్తాంధ్ర, దక్షి కోస్తాంధ్ర, రాయలసీమ‌ ప్రాంతాలలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచాన వేసింది. ఉత్తర కోస్తాంద్రలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు పడవచ్చని తెలిపింది. ఉత్తర బంగాళాఖాతంలో 19 న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ క్రమంలో మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేసింది. విశాఖ తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా అధికారులు ఆదేశించారు. కలెక్టరేట్, రెవెన్యూ డివిజన్ లలో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేశారు. విశాఖ కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నెంబర్ - 08912590102.. విశాఖ ఆర్డీఓ కార్యాలయం- 8790310433.. పాడేరు - 08935250228, 8333817955, 9494670039.. నర్సీపట్నం సబ్ కలెక్టర్ ఆఫీస్ - 8247899530, 7675977897.

విశాఖ ఏజెన్సీలో మత్య గెడ్డ, రాళ్ళ గెడ్డ, కోడిమామిడి గెడ్డలో కాలువలు, చెరువులు ఉదృతంగా ప్రవహిస్తోన్నాయి. జి మాడుగుల మండలం  కిల్లంగికోట పంచాయితీ గ్రామాల్లో నుంచి మండల కేంద్రలకు సంబందాలు తెగిపోయాయి. ముంచంగిపుట్టు మండలంబిరిగుడా బ్రిడ్జి పై వరద ఉధృతి కొనసాగుతుంది. బుంగపుట్టు ,లక్మిపురం గ్రామాల్లో రవాణా వ్యవస్థ నిలిచిపోయింది.

మరి కాసేపట్లో గోదావరికి మూడో ప్రమాద హెచ్చరిక
గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో గోదావరి ఉదృతంగా ప్రవహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ అధికారి కన్నబాబు తెలిపారు. ధవళేశ్వరం వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. మరికాసేపట్లో మూడవ ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుత ఇన్ ఫ్లో 17,18 క్యూసెక్కులు ఉండగా.. అవుట్ ఫ్లో 939 క్యూసెక్కులుంది. సహాయక చర్యల్లో అధికారులు, ప్రజలు ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు సహకరించాలని కన్నబాబు కోరారు. గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

మరిన్ని వార్తలు