నేడు, రేపు భారీ వర్షాలు 

13 Jun, 2021 03:29 IST|Sakshi

మహారాణిపేట (విశాఖ దక్షిణ)/అమరావతి: వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశాలోని తీర ప్రాంతాల్లో స్థిరంగా కొనసాగుతోంది. ఇది వచ్చే రెండు, మూడు రోజుల్లో మరింత బలపడి పశ్చిమ వాయువ్య దిశగా ఒడిశా, జార్ఖండ్, ఉత్తర ఛత్తీస్‌గఢ్‌ మీదుగా కదిలే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర అధికారులు తెలిపారు.

దీనికి తోడు నైరుతి రుతు పవనాలు విస్తరిస్తుండటంతో రానున్న 48 గంటల్లో ఉత్తర కోస్తాలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు, కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. శనివారం శ్రీకాకుళం జిల్లా హీరలో 30 మిల్లీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది.  

మరిన్ని వార్తలు