నదిలో జేసీబీపై చిక్కుకున్న 10 మంది.. రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్‌

19 Nov, 2021 12:23 IST|Sakshi

సాక్షి, అనంతపురం: వర్ష బీభత్సంతో అనంతపురం జిల్లాలో ప్రవహించే చిత్రావతి నదిలో 10 మంది చిక్కుకున్నారు. చెన్నేకొత్తపల్లి మండలం వెల్తుర్ది గ్రామం వద్ద చిత్రావతి నదిలో కారు గల్లంతు అయ్యింది. అందులోని నలుగురు వ్యక్తులను రక్షించేందుకు మరో ఆరుగురు వెళ్లారు. మొత్తం 10 మంది జేసీబీ లోనే ఉండిపోయారు. తాళ్ల సాయంతో.. విద్యుత్ తీగల సాయంతో రక్షించే ప్రయత్నాలు విఫలమయ్యాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డిని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి కలిసి జిల్లాలోని పరిస్థితిని వివరించారు.

తక్షణమే వరద బాధితుల కోసం విశాఖ, బెంగళూరు నుంచి రెండు హెలికాప్టర్లు పంపేలా సీఎం జగన్ చర్యలు తీసుకున్నారని ఎమ్మెల్యే తెలిపారు. రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్‌ అయిందని ధర్మవరం డీఎస్పీ రమాకాంత్ తెలిపారు. రెస్క్యూ సిబ్బంది 10 మందిని సురక్షితంగా బయటకు తెచ్చారని తెలిపారు. ఇదిలాఉండగా.. కర్ణాటక సరిహద్దులోని మేల్యా చెరువుకు గండి పడింది. హిందూపురంలోని కొటిపి, పూలమతి, శ్రీకంఠపురం చెరువులు ప్రమాదకరస్థాయిలో ఉన్నాయి. ఈ సందర్భంగా లోతట్టు ప్రాంతాలను అధికారులు అప్రమత్తం చేశారు.

మరిన్ని వార్తలు