చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు.. రేపు విద్యాసంస్థలకు సెలవు

18 Nov, 2021 19:33 IST|Sakshi

సాక్షి, తిరుపతి: చిత్తూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కల్యాణి జలాశయం పూర్తి నీటిమట్టానికి చేరుకుంది. పాలసముద్రంలో వెంగళరాజకుప్పం చెరువు ఉధృతంగా ప్రవహిస్తోంది. ముందు జాగ్రత్త చర్యగా ప్రభుత్వం శుక్రవారం పాఠశాలలకు సెలవు ప్రకటించింది.

ఇక తిరుపతి నగరం ఎటుచూసినా చెరువును తలపిస్తోంది. కరకంబాడి మార్గంలో భారీగా వరద నీరు ప్రహహిస్తోంది. రైల్వే అండర్‌ బ్రిడ్జ్‌లు కూడా వర్షపు నీటితో నిండిపోయాయి. వర్షపు నీరు రోడ్లపైకి ప్రవహించడంతో ప్రధాన కూడళ్లలో భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది. దీంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌లో భారీగా వరద చేరింది. దీంతో రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌లో విమానాల ల్యాండింగ్‌ను అధికారులు నిలిపివేశారు.

వైఎస్సార్‌ జిల్లా
రైల్వేకోడూరు నియోజకవర్గంలో రైల్వే కోడూరు, చిట్వేలి, పెనగలూరు, పుల్లంపేట, ఓబులవారిపల్లి మండలాల లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
 తుఫాను ప్రభావం తీవ్రంగా ఉండటంతో నియోజకవర్గంలో అన్ని చెరువులు నిండుకుండలా ఉన్నాయని అధికారులను అప్రమత్తం చేసిన ప్రభుత్వ విప్ కోరుముట్ల శ్రీనివాసులు
నియోజకవర్గంలోని పోలీసులను, అధికారులను అలర్ట్ చేసిన ప్రభుత్వ విప్

వైఎస్సార్‌ జిల్లా 
రాయచోటి పట్టణ పరిధిలోని కంచాలమ్మ గండికి వర్షం నీరు అధికంగా వచ్చి చేరుతుండడంతో, నీటి ప్రవాహ ఉధృతి గంటగంటకు పెరుగుతున్నది. ఇంకా వర్షం  పడుతున్నందున మరింత పెరిగే అవకాశం ఉంది.
కావున ముఖ్యంగా మాండవ్య నది ఒడ్డున నివసిస్తున్న 20, 22, 23, 24 సచివాలయాల (హరినాథ వీధి, బ్రాహ్మణ వీధి, పాతరాయచోటి, బిరాన్ సాహెబ్ వీధి, గౌరమ్మ బుగ్గ)  ప్రజలను అప్రమత్తం చేయాలని కమిషనర్ రాంబాబు కోరుతున్నారు.
ప్రజలకు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు ఉన్నా వెంటనే అధికారులదృష్టికి తీసుకొని రావాలని తెలియజేస్తున్నారు.

అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు
నెల్లూరు జిల్లా 
సోమశిల జలాశయానికి పోటెత్తుతున్న వరద
ఇన్ ఫ్లో  134853 క్యూసెక్కులు 
9 క్రస్ట్ గేట్లు ఎత్తి  లక్ష క్యూసెక్కుల నీటిని పెన్నాకు విడుదల చేస్తున్న అధికారులు.
రాత్రికి వరద మరింత పెరిగే అవకాశం
వరద పెరిగే కొద్దీ అవుట్ ఫ్లో శాతాన్ని పెంచనున్న అధికారులు 
లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు

భారీ వర్షాలతో అప్రమత్తమైన టీటీడీ
వాయుగుండం ప్ర‌భావంతో తిరుమ‌ల‌లో నిన్న రాత్రి నుండి నిరంత‌రాయంగా వ‌ర్షం కురుస్తోంది. దీంతో రెండో ఘాట్ రోడ్లో కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డ్డాయి. అక్క‌డ‌క్క‌డా చెట్ల కొమ్మ‌లు కూడా విరిగి ప‌డుతున్నాయి. భారీ వ‌ర్షాల కార‌ణంగా శ్రీ‌వారి ఆల‌యంతో పాటు  ప‌రిస‌ర ప్రాంతాలు  మాడ‌వీధులు, తిరుమ‌ల‌లోని రోడ్లు, కాటేజీలు ఉన్న ప్రాంతాలు జ‌ల‌మ‌య‌మ‌య్యాయి. నిర‌త‌రాయంగా కురుస్తున్న వ‌ర్షంతో భ‌క్తులు తీవ్ర అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. ద‌ర్శ‌నానికి వెళ్లే భ‌క్తుల‌తో పాటూ ద‌ర్శ‌నానంత‌రం బ‌య‌ట‌కు వ‌స్తున్న భ‌క్తులు ప‌రుగులు తీసుకుని షెడ్ల కింద‌కు వ‌స్తున్నారు. భారీ వ‌ర్షాలు ప‌డ‌తాయ‌న్న వాతావ‌ర‌ణశాఖ హెచ్చ‌రిక‌ల‌తో టీటీడీ ముంద‌స్తు జాగ్ర‌త్తా చ‌ర్య‌లు చేప‌ట్టింది.

ఇప్ప‌టికే రెండు న‌డ‌క‌మార్గాల‌ను మూసివేసిన టీటీడీ ఘాట్ రోడ్ల‌లో వ‌ర్షం ప్ర‌భావంపై ప్ర‌త్యేక నిఘా ఉంచింది. ఘాట్ రోడ్ల‌లో కొండ చ‌రియ‌లు, చెట్లు విరిగిప‌డే ప్రాంతాల‌ను గుర్తించి ముంద‌స్తు జాగ్ర‌త్తా చ‌ర్య‌లు తీసుకుంటోంది. ప్ర‌మాద‌క‌ర ప్రాంతాల్లో కంచె, బ్యారికేడ్ల‌ను ఏర్పాటు చేసింది. కొండ చ‌రియ‌లు, చెట్ల కొమ్మ‌లు విరిగిపడుతున్న ప్రాంతాల్లో భ‌క్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వెంట‌నే తొల‌గించేలా టీటీడీ సిబ్బంది క్రేన్ల‌ను సిద్ధంగా ఉంచుకున్నారు.

నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండం
విశాఖపట్నం: నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. ఇది చెన్నైకి ఆగ్నేయంగా 310 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. శుక్రవారం ఉదయం చెన్నై దక్షిణ కోస్తా జిల్లాల మధ్య తీరం తాకే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఈ రోజు, రేపు.. కోస్తా, రాయలసీమ జిల్లాలకు వర్ష సూచన ఉంది. ఈ రోజు చిత్తూరు, కడప జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రకాశం, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. కృష్ణా గుంటూరు కర్నూలు జిల్లాలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.

నెల్లూరు జిల్లాలో పలుచోట్ల కుండపోత
బాలాయపల్లి మండలం కడగుంట, నిందలిలో వరద ప్రవాహం
నిందలి వద్ద కాజ్‌వే పైనుంచి ప్రవహిస్తున​ వరద నీరు
కడగుంట వద్ద కైవల్య నది మినీ వంతెన పైనుంచి వరద ప్రవాహం
దగ్గవోలు- నిందలి మార్గంలో నిలిచిన రాకపోకలు

గూడూరు వద్ద ఉదృతంగా ప్రవహిస్తున్న పంబలేరు వాగు
వాగుదాటేందుకు ప్రయత్నించిన ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు 
అదుపు తప్పి జారిపోయిన విద్యార్థిని కాపాడిన విద్యార్థులు
పొంచి ఉన్న ప్రమాదం

మరిన్ని వార్తలు