Heavy Rains Alert: వాయుగుండంగా మారిన తీవ్ర అల్పపీడనం.. భారీ వర్షాలు!

10 Aug, 2022 04:29 IST|Sakshi

24 గంటల్లో బలహీనపడే అవకాశం 

కోస్తా జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు  

సాక్షి, అమరావతి: వాయువ్య బంగాళాఖాతంలో దక్షిణ ఒడిశాను ఆనుకుని కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా చత్తీస్‌గఢ్‌ వైపు పయనించి 24 గంటల్లో నెమ్మదిగా బలహీనపడుతూ భూమి మీదకు ప్రవేశిస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో మంగళవారం కోస్తా జిల్లాల్లో పలుచోట్ల భారీ నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి.

శ్రీకాకుళం జిల్లా జగ్గిలిబొంతులో 6.9 సెం.మీ వర్షం కురిసింది. అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మడుగుల మండలం కుంతలంలో 6.6, శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో 5.5, పలాసలో 5.2, కాకినాడ జిల్లా తాళ్లరేవులో 5.1 సెం.మీ వర్షం కురిసింది. బుధవారం నుంచి వర్షాలు అక్కడక్కడా తప్ప చాలా ప్రాంతాల్లో తగ్గుముఖం పడతాయని వాతావరణ శాఖాధికారులు తెలిపారు.  

>
మరిన్ని వార్తలు