రేపు వరద ముంపు ప్రాంతాల్లో మంత్రి పర్యటన

14 Sep, 2020 21:22 IST|Sakshi

సాక్షి, పశ్చిమగోదావరి : జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న దృష్ట్యా ఏలూరు నియోజకవర్గంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్లనాని సూచించారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేస్తూ ప్రజలకు ఎక్కడ ఇబ్బంది లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు ఇచ్చారు. పల్లపు ప్రాంతంలో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. (కారు బోల్తా: ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులు మృతి)

గంట గంటకు వర్షం పెరగడంవల్ల ఏలూరు నియోజకవర్గంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అన్ని శాఖల అధికారులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. మంగళవారం ఉదయం 9గంటలకు ఏలూరు నియోజకవర్గంలో వరద ముంపు ప్రాంతంలో ఏపీ డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలు రాజు పర్యటిస్తారు అని మంత్రి కార్యాలయం వర్గాలు తెలిపాయి. (ఏపీలో కొత్తగా 7,956 కరోనా కేసులు)

మరిన్ని వార్తలు